పుట:Haindava-Swarajyamu.pdf/288

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
280

హరిశ్చంద్రోపాఖ్యానము.

నని యిట్లు చాయగా నాడిన మాట
విని హరిశ్చంద్ర భూవిభుఁ డాత్మ . గలగి
తగ విచారించి 'యీ తరుణి నా పత్ని
యగు' నని మనసు సయ్యనమగిడించి
'గట్టిగా నెఱుఁగ కీగతిఁ దలం పే ల ..................................2170
పుట్ట విశ్వేశ నా బుద్ధిలో' ననుచుఁ
బరితాప మంది యప్పడఁతి నీక్షించి
మరి పల్కె 'జోద్యంపుతూట లాడెదవు
నట్టేడు దీవులనడు మెల్ల నేలు
పట్టభద్రుని కూర్మి ప ట్టట బాలుఁ
డామహీశుని దేవి వఁట నీకు విత్త
మేమియు లేదన్న నెటు నమ్మ వచ్చు
నీకెంత గలిగిన నిన్నదలించి
మాకుఁ గైకొన రాదు మాడకు మిగులఁ
జేకొని యేలిక చెప్పిన చొప్పు
గాక నీ పేదఱికము నాకుఁ బొ త్తె.....................................2180
పాటలగంధి నీపలు కియ్యకొనఁగఁ

.............................................................................................................

మగునట్లు - ' ఏడు దీవుల నేలు రాజకుమారుఁ డనుమాట జాడఁగాచం ద్రమతీవృ త్తాంతమును సూచించినపని భావము. మనసు సయ్యనమగిడించి = మొదటభార్య గాఁదలఁచి పిదప నట్లు తలఁపఁ గాదని మనస్సును త్రిప్పుకొని, గట్టిగా నెఱుఁగక = రూఢిగా నన్ని యుఁ దెలిసికొనక, పట్టఁట= పట్టియఁట - ఇటనిత్తునకు సంధివి చార్యము, నీ కెంతగలిగినను= నీకు ఎంత సంపద యుండినను, మాకు ...మిగుల - మాడకం టే నెక్కువగా మాకుఁ బుచ్చుకొనరాదు, నీ పేదఱికము నాకుఁ బొ త్త=నీ లేమిడితో నాకేమైన సంబంధమా? నీ లే మిడిని పాటింపవలసిన యక్క ఱ