పుట:Haindava-Swarajyamu.pdf/284

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
276

హరిశ్చంద్రోపాఖ్యానము,

బొమను మసిపాతఁ బొదిఁగినమాడ్కి-
నెమ్మేని క్రొమ్మ్రించు నిగుడక మాసి
నా కేశుఁ బాసిననాఁటిపౌలోమి
చేకొన్న దుర్దశ : జెందిన ట్లున్న .................................2090
భావించి యాత్మ లోఁ బలుమాఱు వగచి
భూవల్ల భుఁడు దానిముందఱ నిలిచె
నిలిచినఁ గనుఁగొని నివ్వెఱపాటుఁ
గళవళంబును మదిఁ గడలు కొనంగఁ
'దొలఁగినపయ్యెద తుంగ స్తనముల
నలవడఁ గప్పు నయ్య య్యబ్జాక్షి జూచి
వెర్ఱవకు మీవయో వెలఁది యిచ్చోట
'నెఱసిన చీకటి నిట్లొంటి నున్న
నెఱసాహసివి మరి నీ కేటి వెఱపు
'మరుగు పెట్టక చెప్పుమా నీకు నిట్టి..............................2100
నెగు లింతయును నేమి నెపమునవచ్చె
మగువ నీ పేరేమి మగనిపేరేమి
యెచ్చట నుండుదు వీ బాలుఁ డెట్లు
చచ్చె' నావుడు ముఖాబ్దము వేల వై చి

...................................................................................................

గుడు=నలుపు - మాలిన్యము, మసిపొత = మాసినగుడ్డను, నెమ్మేని క్రొమ్మించు = దేహముయొక్క క్రొత్త కాంతి, నిగుడక = ప్రసరింపక , నా కేశన్...దుర్దశన్ దేవేంద్రుని ఎడఁ బాసినప్పటి శచీదేవి పొందిన దురవస్థ, నివ్వెఱపాటు= ఆశ్చర్య ము, కళవళము= కలఁత, నెఱసిన చీఁకటి=నిండుకొన్న చీకటి, నెఱసాహసివి= పూర్ణ సాహసము గలదానవు, నీ కేటి వెఱపు= ఇంతటి సాహసముగల . నీకుభయ మే ల, నెగులు= బాధ, విప్రవరునింట=బ్రాహ్మణో త్తముని గృహమునందు, తప్పనా