పుట:Haindava-Swarajyamu.pdf/282

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
274

హరిశ్చంద్రోపాఖ్యానము.

పొంత యొల్కులలోనఁ బొడవడి కాలి
కొంత చిక్కినకడకొఱవులు దెచ్చి
కుఱు ప్రోఁగుగా నిడి కొడుకు నం దునిచి
కొజువి నొక్కటఁ దలకొఱ విడఁ బూని
చేతు లాడక మోము చీరతో నొ త్తి
యాతురంబున నేడ్వ నా యార్త రవము
విని హరిశ్చంద్రుండు విస్తయం బంది
'ననుఁ గన్మొఱంగి యీనడు రేయి నకట..........................2660
యీ వల్ల కాటిలో నీ యార్తరావ
సవిధి విన వచ్చె నెలుఁగుచందమును
బోలింప సతి గాని పురుషుడు గాఁడు
చాలు నీతలపోత సయ్యననేఁగి
కదిసి చూడక పొందు గాదని ముద్ర
గుదియ మూఁపున నికి క్రూర ఖడ్గంబు
మొల ట్రెండుతో నంట ముడి వేసి బిగిచి
కులగిరి పై నుండి కుంభినిమీఁది
కసమున నుఱుకుసింహంబుచందమున

.......................................................................................................

వర్తించునట్టిది, పొంత యొల్కులు= దాపటి పీనుఁగులు, పొడవశి-=కనఁబడి, కడ కొఱవులు = కాలఁగా మిగిలినకట్టెలు, కురు ప్రోగు=చిన్న రాసి, కొఱవి ... వి డన్ = ఒక్క కొఱవి చే తలయందు పెట్టుకొఱవిని బెట్టుటకు, మోము చీరతోనో త్తి= మొగమును చీర తోఁగప్పుకొని, కనొఱంగి = ఏమరించి, ఎలుఁగుచందమును పోలింపఁగాన్ = కంఠధ్వనితీరును తార కాణ చేసిచూడఁగా, సతి = స్త్రీ, చాలు నీతలపోత = స్త్రీయోపురుషుఁడోయని యిచట నేయుండి తర్కించుకొనుచుం డుట చాలును, పొందు గాదు= తార కాణ యేర్పడదు, మొలద్రిండు= మొలయం దలిదట్టి, కుంభిని= భూమి, అసమునన్- దర్పమున, ఆదట=ప్రేమము,