పుట:Haindava-Swarajyamu.pdf/281

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ద్వితీయ భాగము.

273

వెదకి యీవసపాల వితు నేమందు'
నని పాము నిందించి యంతరంగమున
దను దానె యూరార్చి ధైర్యంబు దెచ్చి
“వెల్లువ వొరలినవిధిని నీయడవి
మల్ల డి గొనువగ మాన కేడ్చినను....................................2040
నుతుని ప్రాణములు వచ్చునె వీనిఁబుణ్య
గతికిఁ బోవ దహించి కాలకౌశికుని
ముదిత మేల్కొనకయ మున్నె నేఁ బోయి
వదలక పని దీర్ప వలయు నిచ్చోటఁ
దడయుట గా దని తనచీర బిగిచి
కొడుకు వీఁపునఁ గట్టుకొని కొంత దవ్వు
చని చితి కే శాస్త్రిశకల కపాల
ఘనచర్మ సంకీర్ణ ఘట జీర్ణ శూర్ప
భసిత సముద్భటపటునటద్భూత
విసర బేతాళ సంవృత్తమై చూడ
నతిభీకరం బైనయా రుద్రభూమి
ధృతిఁ జొచ్చి యం దొక్క దెసఁ బుత్రు డించి ............................2050

.................................................................................................. వెల్లున్ పొరలిన విధిని= ప్రవాహము ప్రవహించిన తీరు గా, మల్లడిగొనువగన్ = పెనఁగొనుదుఃఖమున ఒకదుఃఖముతో మఱియొక దుఃఖము పెనఁగొను నట్లుగా, బిగిచి= బిగించి, చితి....సంవృత్తమై - చిత=పొదలు, కేశ = వెండ్రుక లు, అస్థి= ఎముకల, శకలకైతునుకలు, కపాల= పుర్రెలు,మనచర్మ = పెద్దతోళ్లు, సంకీర్ణ ఘట= చెల్ల చెదరై నకుండలు, జీర్ణశూర్ప = చిరిఁగిన చేఁటలు, భసిత =బూడి ద, సముద్భట = మిక్కిలి ఉద్ధత మైనదియు, పటు=బిట్టుగా, నటత్ = ఆడుచు న్న, భూతవిసరణ = భూత సమూహములు, బేతాళ = బేతాళుఁడును, సంపృత్తము