పుట:Haindava-Swarajyamu.pdf/28

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది
24

హైందవ స్వరాజ్యము.

లను సుప్రసిద్ధాంగ్లేయ గ్రంథకారుఁడు ఈ రాజ్యాంగసభను ప్రపంచమున కంతటికిని మాటలమారిదుకాణమని వర్ణించినాడు. సభ్యులు సమ్మతి యిచ్చునప్పుడా? ఆలోచన యేమియు చేయరు. తమకక్షువా రెట్లు కోరిన నట్లేయందురు. అది కక్షశిక్షణయట. ఏసభ్యుడైనను కాదని స్వతంత్రముగా తనసమ్మతి నిచ్చెనా అతడు తనవర్గమునకు ద్రోహచింతకుడుగా గణింప బడుచున్నాడు. రాజ్యాంగ సభలో నష్టమగుకాలమును ద్రవ్యమును ఎవరో కొందరు శిష్టుల చేత పెట్టినఎడల ఇంగ్లీషుజాతి యీనాటి కింకను నెంతో ఉచ్చతర స్థితియందుండి యుండును. ఈ రాజ్యాంగ సభ ఇంగ్లీషు జాతివారు పెట్టికొనిన దండుగవ్యయపుబొమ్మలాట. ఈయభిప్రాయములు నాయొక్క నివే యనుకో బోకుడు. గొప్ప ఇంగ్లీషు భావజ్ఞు లీరీతిని నుడివియున్నారు. ఆరాజ్యాంగ సభలోని సభ్యుడొక్కడు క్రైస్తవుడెవ్వడును ఆసభలో సభ్యుడుకా వీలులేదని ఇటీవలనే వాకొనియున్నాడు. మరియొకడు ఈసభను వట్టిశిశువుగా వర్ణించినాడు. ఏడునూరేండ్లిది శిశువుగానున్న, దీని కెప్పుడు యౌవనముకలుగునో యెవరు చెప్పగలరు?


చదువరి: మీరాలోచన పురికొల్పినారు. మీరు చెప్పినదంతయు వెటనే యుగీకరింప మనరుగదా! క్రొత్తక్రొత్త భావ మార్గములను వారు సూచించుచున్నారు. నాకవి శల్యగతము