పుట:Haindava-Swarajyamu.pdf/278

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
270
హరిశ్చంద్రోపాఖ్యానము

క్రమమఁ దెలి చెంది కన్నీరు దొరుఁగ
నమ్మది రాక్షి యిట్లని యేడ్వఁ దొడఁ గె
‘హా లోహితాస్య వంశైక విస్తార
లాలిత సౌభాగ్యలక్షణాకార
నిర్వికార మహాగుణాధార
భూనుతఘనమణిభూషణో దార
హా సుకుమార కల్యాణవిహార
వాసి కెక్కినచక్రవర్తికుమార ..................................1990
తిన్న నినగ నామతించు నీ మోము పుట్టు,
కన్నులపండువుగాఁ జూడకున్న
బులకండ మొలుకునీ ముద్దులమాట
లలవడ వీనుల నాలింప కున్న
మెఱుఁ గారునీబోదుమేను చిత్తంబు
కఱవు మా నక్కునఁ గదియింప కున్న
నొడలఁ బ్రాణము లుండ ఇక నిమిషంబు
నెడముగా నినుఁ బాసి యే నెట్టు లొర్తు
నే తెరువునఁ బోయి యే నెట్లు వత్తు
నాతోడఁ జెప్ప వే నాతోడునీడ..................................2000
యెచ్చట నుండి నిన్నెలమి నేఁ బిలువ
వచ్చి నన్ బొడగాంచి వదనాబ్ద మలర
నెదురుగా వత్తు నేఁ డేటికి రావు

..............................................................................................................

డా, తిన్న నినగవు=చక్కనినవ్వు, ఆమతించు= పుట్టు, పులకండ ము=కండచక్కెర, బోదు మేను- గోముగాఁ బెరిఁగిన మేరు,అక్కునక్ = తొమున, ఎడము గా - " గా నీకు నాకు చేరిక లేనట్లు గా, ఎచ్చటనుండి = ఎక్కడనుండి గాని,మరులు= మే లోర్తు తెఱపి