పుట:Haindava-Swarajyamu.pdf/277

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

m

ద్వితీయ భాగము.

269.

దొడరిన పతిభ క్తి తోడుగా నరిగి
పొడవైన వటభ స్మపుంజంబు గాళ్ల
కడను బుట్ట తలాపికడ నుండ నిట్లు
పడి కన్ను లరమోడ్చి పాదముల్ వీడు
పడఁ జూచి మృదుపాణిపల్లవయుగము
వెడఁదయురంబుపై వేసి గళంబు
కుడి దిక్కు భుజముపైఁ గొండొక వంచి ..........................1970
మొగ మోరగాఁ బెట్టి ముందటిచుంచు
జిగి దప్పి కెంధూళిచే బీదువారి
యొక వికారము లేక యూరక తొల్లి
ప్రకటని ద్రావస్థఁ బరఁగుచందమున
నున్న యాలోహితాస్యునిఁ జూచి ప్రాణ
మున్నదో లేదని యువిద మూర్చిల్లి
ధర మీఁదఁ బడి పెద్దదడవుకుఁ దెలసి
పురపురఁ జిత్తంబు పొక్క నందంద
చెందమ్మి రేకులఁ జెనకుహ స్తముల
ముందలయును మొగంబును మోఁదుకొనుచుఁ ...................1980
జాలఁ గీ లెడలినజంత్రంపుబొమ్మ
పోలిక మూర్చిల్లి పుత్రువై వ్రాలి

.......................................................................................................

మర్రిపొడి రాసియు, తలాపికడ పుట్టయును గానుండునట్లు, వీడుపడన్ = వేఱు వేళ ఎడగలుగఁగా, మృదుపాణి పల్లవయుగము= చిగుళ్ల వంటి మెత్తని చేతులదోయి, వెడఁదయురము=విశాలవక్షము, గళంబు=మెడ, చుంచు=కూఁకటి, జిగిదప్పి = కాంతిమాసి, కిందూళి చే బీదువాటి.ఎఱ్ఱదుమ్ము చేత వన్నె మారి, చెకు=మారా డు=పోలునట్టి, కీలు ఎడలిన= మఱవీడిన, కల్యాణవిహార = శుభమైన నడవడిగ వాఁ •