పుట:Haindava-Swarajyamu.pdf/268

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
260

హరిశ్చంద్రోపాఖ్యానము

వాలుగొ మ్మొక కేల వడి వంచి యున్న
కేలు సాఁపఁగ గమకించునాలోనఁ
గాలకంఠ కఠోర కర కంపితోగ్ర
శూలాగ్ర నిర్గత స్థూల కీలాభ.........................1810
లోలజిహ్వారుణలోచనం బగుచుఁ
గ్రా లేడు ఫణము భీకరముగా ముడిచి
యాలోన నడఁగినయమ్మహాభుజగ
మాలోహితాస్యుని నదరంటఁ గఱచె
నా విషవహ్ని భగ్గునఁ బేర్చి మేన
నావహింపక మున్నె 'హా మాత ! యనుచుఁ
జావుతో సరిపోల్పఁ జనుమూర్ఛ నొంది
భూవరపుత్రుండు భూమిపై వ్రాలె
నంత. భస్మీ భూత మయ్యె నా వటము
సంతియ కాని యాయాదిసర్పంబు .................1820

................................................................................................


పౌలుగొము = వాలియున్న శాఖ, ఉన్న కేలు= తక్కిన చేయి, కాలకంఠ ... లోచనంబు, కాలకంఠ = శివునియొక్క, కఠోర = కఠినమైన, కర= చేతి చేత, కంపిత -= ఆడింపఁబడిన, ఉగ్ర=భయంకగమైన, శూలాగ్ర = శూలము మొ! ననుండి నిర్గత = వెడలిన, స్థూలకా పెద్దదైన, కీలా = జ్వాలతో, ఆభ = సాటి యైన, లోల= చలించుచున్న, జిహ్వా నాలుకయును, అరుణలోచనము = ఎఱ్ఱనికన్నులు గలది, ఇచట శివుని చేతికిని, పాముపడఁగకును, శూలము నకును పాము నాలుక కును, శూలాగ్రమందలి స్థూలకీలకును పాము ఆరుణలో చనమునకును సామ్యము దెలియుసది, ఫణము=పడగ, అదరంటన్ = బిట్టుగా పేర్చి = విజృంభించి, ఆవహింపక = ప్రవేశింపక, చావుతో... మూర్ఛ= మరణ ముతో సమానము చేయ దగినసొమ్మ, ఆదిసర్పంబు తక్షకుఁడు, జనని తల్లి