పుట:Haindava-Swarajyamu.pdf/266

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
258

హరిశ్చంద్రోపాఖ్యానము

యహికులో త్తమ లోహితాస్యకుమారు
గహనఁ బులోఁ బడఁ గఱచి రమ్మనిన
దకయక పనిఁ బూసి తక్షకుం డపుడు
వడి నేఁగి యల పితృవన సమీపమునఁ.............................1770
దళ్లు కొట్టెకిగుంటదరిఁ జాలఁ బ్రబలి
చల్లగా నీడయై చలివెంద్రపూలె
మట్టంపుఁబొడవున మా నై నమర్రి
చెట్టు క్రిందటి పుట్ట చేకొని యుండె
నా తక్షకునిచేత కనుకూల మొదవం
బ్రీతితో శిష్యులఁ బిలిచి కౌశికుఁడు
'మునికుమారకులార ముదమున మీరు
చని లోహితాస్యుని సంగడిఁ గూడి
వనములోఁ జరియించువానిఁ బ్రేరేచి
కొని పోయి తక్షకు ఘోరవిషాగ్ని.......................................1780
బడఁ ద్రోచి రం'డని పనిచినవారు
తడయక చని రాచతనయునిఁ గాంచి
'యో లోహితాస్య మాయెజ్జలు వనుప
నీ లీల వచ్చి ము న్నెప్పుడు నిచటఁ
గడునొప్పుఫలములుఁ గంద మూలములు
నుడుగక కొనిపోవు చుందుము గాన

.....................................................................................................

ర్వతములు, ముగ్గులు వాఱన్ = చూర్ణమగునట్లుగా, గహనంబులో రరానియడవియందు,పడన్ = నేలఁగూలునట్లు, పితృవన సమీపమునన్ =వల్లె కాటి దాపున,తళ్లుకొట్టెడుగుంటదరి= చినచిన్నయలలు కొట్టుచుండెడి కొలనిగట్టున, చలి వెంద్ర = చలిపందిరి, మట్టంపు పొడవున = దిట్టమైన పొడవు చేత, మానై న =