పుట:Haindava-Swarajyamu.pdf/262

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
254

హరిశ్చంద్రోపాఖ్యానము,

మటుమాయలను జిక్కి మలక లఁ జొక్కి
యుపవాసములఁ గుంది యుడుకులఁ గంది
యెపుడు చింతల వేగి హృదయంబు గ్రాఁగి...................1690
కంటకంబుల నొచ్చి కన్నీరు దెచ్చి
కంటసంబులఁ జిక్కి కఱుకులఁ బొక్కి
మురి పెంబు వీడి మోము గరంబువాఁడి
గరువంబు దూలి శృంగారంబు మాలి
విశ్రాంతి మది నాటి వెలు వెలఁ బాటి
విభమంబులు జాతి విశ్వేశు దూరి
బలు రాహుముఖమునఁ బడి కాంతి దప్పి
జలదరించెడు బాలశశి రేఖఁ బోలె
నలిగి యందఱు 'హంసనారి నాఁ బరఁగి
బలు బాములకు నోర్చి పట్టియుఁ దాను.....................1700
దినమును జంద్రమతీ దేవి పనుపు
పనులు సేయుచు నిట్లు పండ్రెండు నెలలు
మునుకొని వర్తింప భూపాలసుతునిఁ
గనుఁగొని యొక నాఁడు కాలశికుఁడు
చేరి 'యో లోహిత చెలఁగి యే ప్రొద్దు
నీరీతిఁ జంటి క్రిం దిటికి యీ తొత్తు

........................................................................................................

చుటలు, క్రాగి=క్రాఁగిన దై, కంటకములు = విరోధో క్తులు, కంటనంబులు= విప్రలాపములు, కఱుకులు =కాఠిన్యములు, మురి పెంబు = మురువు - నడల యొయ్యారము,గరువము= గొప్పఁదనము, జలదరించెడు... రేఖ=కంపించుచున్న లేత చంద్రకళ, హంసనారి= ఇది చంద్రమతికి కాల కౌశికునింటఁగలిగిన పేరు, బలు “బాములు= పెనుఇడుములు, చంటి క్రిం దిరికి స్తనముల క్రింద నేహత్తుకొని - తల్లి -