పుట:Haindava-Swarajyamu.pdf/261

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

253

ద్వితీయ భాగము.

'ప్రొద్దునఁ జను దెంచి పొడచూప కున్న
గ్రుద్ది యీ దుడ్డునఁ గొట్టుదు' ననుచు
విపులసంపద గలవీర బాహునకు
'జపము సేయుఁడు మంత్రసాధకు' లనియుఁ.......................1670
జండాలుఁ డనక మాస్వామి దీవించి
రండు నిచ్చలు బ్రహరాక్షసు' లనుచు
గట్టిగా నియమ షూ"క్రమమునఁ జేసి
నిట్టరాడునుఁబో లె నిలుచున్న వాని
బేతాళు నొక్క నిఁ బిలిచి నీ వింక
ఘాతగా నా కొల్వుకాఁడవై వీరి
గొట్టి యిందఱిఁ బనిగొనుచు నిచ్చోటఁ
బెట్టింపు తగు మంచఁ బెంపార' ననిన
వసుధఁ జాఁగిలి మొక్కి. వాఁడును నేఁగి
మసలక దిబ్బగా మన్ను వ్రేయించి....................................1680
సమముగా ఘనశిలా స్తంభముల్ నిలిపి
యమరంగ నొక మంచ యామీఁద వైచి
“విచ్చేయు' మని విన్న వించిన విభుఁడు
వచ్చి యా మంచపై వలనొప్ప నుండి
యడిదంబు తోడుగా నా రుద్ర భూమి
కడు నప్రమత్తుడై కాఁ పుండె నంత
నట కాలకౌశికునాలయంబునను


..................................................................................................

పఱుపక, నిట్టరాడున్ = ఇంటినడుమపొడవుగా నాటినకంబము, ఘాత గా= గ ట్టిగా కొల్వుకాఁడు = భృత్యుఁడు, అడిదము = కత్తి, మటుమాయలు = మిక్కుటపుమాయలు, మలక లు= వంకరలు, ఉడుకులు = కొందలములు తపిం