పుట:Haindava-Swarajyamu.pdf/258

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
250

హరిశ్చంద్రోపాఖ్యానము.

మొల నున్న వస్త్రంబు మొగము కోక యును
వలనొప్ప నొకమాడ వాతి పాతిక యుఁ
ఔనుపొంద నాకిచ్చి పిండాశ నంబుఁ
దిని నీవు బ్రతుకు మీ దినముననుండి
వీరదా సనుపేర వెలయు మీ విపుడు
కోరిపట్టడుముద్ర గుదియ గొ'మనుచుఁ
దన చేతి కిచ్చిన దగఁ బని పూని
వినయంబుతో మొక్కి వీడ్కొని పోయి
యత్తజ గమురుకం పడరి దిక్కులను
మొత్తమై నిగుడు'క్రొంబొగలు నంతంత..........................1620
మండు నొల్కులుఁ జేరి మానవమాంస
ఖండంబు లొండొండఁ గసికిలఁ గ్రుచ్చి
కమ్మగాఁ గాల్చి చంకటఁ బెట్టి మెసఁగి
నెమ్మది నృత్యంబు నెఱపుభూతములు
సగము గాలుచు నున్న శవములఁ బట్టి
తిగిచి గుంపులు గూడి తినుపిశాచములు
నెడ నెడ బొక్కల నిజన బాలకుల
వెడలించి భక్షించుబేతాళతతులుఁ
దల కాయలకు మూఁగితమతమ వనుచుఁ
గలహించుడాకినీగణములు మఱియు..............................1630

.........................................................................................................

పొడిచి= అగపడి - వారిక నుట, వాతి పాతిక = వాతి కాసును, పిండాశనంబు= తర్పణములప్పుడు పెట్టుపిండము లాహారము, కమరుకంపు= కాలిన దుర్గంధము, ఆడరి- =వ్యాపించి, ఒల్కులు= పీనుఁగులు, కసిక లు= సలాకలు - శూలములు, ఎడ నెడ =నడుమనడుమ, బొక్కల = గుంతలందు - బిడ్డలను సొద పెట్టి కాల్ప