పుట:Haindava-Swarajyamu.pdf/256

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
248

'హరిశంద్రోపాఖ్యానము.

గజచి కుక్కలు పీకఁ గాఁ బెను కొమ్ము
లొఱగఁ దీసినరీతి నున్న డొక్కలును
వఱద లై నెత్తురు వడియుకుత్తుకలు
తఱిఁగిన గోవులు తఱు చైనపచ్చి
మురియలు సెదరినముఱికి నంజుళ్లు
'నఱచు కాకులుఁ గలయామాలవాడ
వడిఁ జొచ్చి ప్రేవులు వాతి కే తేర
నడరుదుర్గంధంబు కణు మాత్ర మైనఁ........................1580
గింక రిపడక శంకింపక ధైర్య
మింకక చండాలునింటికి నేఁగి
యడరంగ భూపాలుఁ డామాల దన్ను
గడఁగి పంపుచు నున్న కష్టంపుఁబనులు
నెలకొని నిమిషంబు నిలిపిన కాలు
నిలుపక సొలవక నిద్దుర వోక
కలఁగక నన్నోదకములపై నాస
గొలుపక వ్యపగతకు తృష్ణుఁ డగుచు
మొగము స్రుక్కింపక ముడుఁగక రేయుఁ
బగ లన కమ్మహీపాలు: డొనర్ప.....................................1590

.............................................................................................................

వికారపురూపుగల పనివాండ్రు, పసరంపు=పశువుల యొక్క , బడికి వేయఁగన్ = పదను పెట్టుటకు, ఒఱఁగ దీసినరీతిన్=వాలునట్లు విలవిల రాచుకొన్న విధ ముగా - కుక్కలుఁ పీఁకఁగా నొప్పికి కొమ్ములు ఒఱగునట్లు నేలరాచినరీతి గా నే యున్న మృగముల బొందులనుట, మురియలు జఖండములు నంజుళ్లు=మాంసము లు, ప్రేవులు వాతి కే తేరక్ = అసహ్యమైన దుర్గంధము నకు ఓకిలింత పుట్టి కడుపు లోని ప్రేఁగులు నోటికి రాఁ గా, కింకిరిపడక =రోఁతపడక, వ్యపగ తక్షుత్ తృష్ణు డు=పోయినట్టి ఆఁకలిదప్పులుగలవాఁడు, స్రుక్కింపక =ముడుఁగక, నెరసులు=