పుట:Haindava-Swarajyamu.pdf/255

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ద్వితీయ భాగము

.

247

లక్ష భంగుల నృపాలకుని దీవించి
'యుర్వీశ మాకు నీ వొడఁ బడ్డదనము
నర్వంబుఁ జెల్లె నీశ్వరసాక్షి గాను
విచ్చేయు మిఁక' నని వీర బాహునకుఁ
ఇచ్చెర నప్పన సేసెఁ జేసేత
దివినుండి కనుఁగొని దివిజులు మెచ్చి
యవనీత లేశున కాఁకలి దప్పు
లొదవ కుండఁగ వరం బొసఁగి రావేళ
సదయుఁడై యంతటఁ జని యంత్యజుండు..........................1560
ముద మారఁ దనగృహంబునకుఁ బో నచటు
గదలి సగర్వంబుగాఁ దన చేతఁ
బట్టిన పశుమాంసభారంబు చంకఁ
బెట్టిన మద్యంపుబిందియ నిచ్చి
‘కొని రమ్ము నీవన్నఁ గువల యేశ్వరుఁడు
వినయసంభ్రమములు వెలయ వహించి
యే సిడిముడిపాటు నే వికారంబు
నేసిగ్గు రోఁతయు నెసఁగక వానిఁ
గొలిచి సంగడిఁ జనుగోసంగిబంట్ల
గలసి తా నటు చని కలయ నెల్లెడలఁ..................................1570
బడి యున్న ముడుసులు పసరంపుఁ దలలు
బడికి వేయఁగ నెండఁ బరిచినతోళ్ళు

..........................................................................................................

కొన్న , అప్పర సేసెన్ = అప్పగించెను, చేసేఁత = చేతిలో చేయివై చి, దివిజలు-= - దేవతలు, అంత్యజుఁడు = మాలవాఁడు, మద్యం పుబిందియ= కల్లుకుండ, చిడిముడిపాటు = తొట్రుపాటు, సంగ డిన్ =తనతో జత గా, కోసంగిబంట్లు=