పుట:Haindava-Swarajyamu.pdf/251

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

243

ద్వితీయ భాగము

వేడుక జట్టి గావించి నా పూన్కి
వీడ నాడకు మాకు విత్త మిం తనిన
లోఁగి యీఁతకుఁ గానిలో తని జట్టి
వీఁగక సర్వధా వినియెద నేని
పురుషు డేనుఁగు నెక్కి పొడవుగా నిక్కి
వరరత్న మెగిరిపో వై చినపొడవు
ధనరాశి మా కిమ్ము తడయ లెమ్ము
విను నిక్క మిది నుమ్ము వీఁడు నీ సొమ్ము1490
గొను' మన్న వాఁడు నిక్కుచుఁ బల్కెనీకు
ధనరాశి యిచ్చోటఁ దరలక నిత్తు
నొక విచారము మాకు నొదవె నీ రాజు
సుక వాసి పనిపంద చూపుగుజ్జంబు
మామిడి క్రిందిసోమరి మేదకుండు
భూమి తుంటరి యెనుపోతు పై వాన


వేడుక జట్టి గావించి = ఎగతాళికి బేరము మాట్లాడి, నాపూన్కి వీడనాడకు = నీకమ్మవలయున నెడి నా ప్రయత్నమును నేను విడిచి పెట్టినట్లు బేరము మాట్లాడ కుము,విత్త మిం తనిసర్" = మాకు వేల గా నియ్యవలసిన ద్రవ్యము ఇంతయని చెప్పఁ ఈఁతకుఁ గానిలోఁతుఅని= ఈత కొట్టుటకుఁ దగినలోతు లేదని- ఇచ్చిన వెలకు తగినంతలాభము లేదని యనుట, వీఁగక వెనుదీయక, నిక్కుచుక్బి ట్టుబిగిసికొనుచు, తరలక =తప్పక, సుకవాసి= సుఖము గా బ్రతికిన వాఁడు, పని వంద = పనులు యందు మందుఁడు, చూపు గుజ్జంబు పైచూపునకుఁదోఁచు బచ్చెనగుఱ్ఱము, మామిడి క్రిందిపోమరి మామిడి చెట్టు క్రిందనుండు సోమరిపోతు, పేదకుఁడు = గోలయైన వాఁడు, భూమితుంటరి భూమినిదున్ను వాఁడు, ఎనుపోతు పై వాన = ఎనుపగొడ్డ. పెవానవింటివాఁడు - ఎనుముమీఁదవానయెంత గురిసి నేను దానికి చలిపుట్టనట్లు ఎంత తర్జనభర్జనములు చేసినను వీనియెడ ప్రయోజన