పుట:Haindava-Swarajyamu.pdf/249

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

241

ద్వితీయ భాగము.

గొనిపోయి న న్నము” మ్మంటి గాని
వినుతసత్కులజుని వెదకి యిమ్మనవు
వీనికులం బేల వీనిరూ పేల
వీనిగుణం బేల వీని పెం పేల
మాలైన నేమి బ్రాహణుఁ డైన నేమి
తోలు గప్పిన నేమి తులువైన నేమి
గంజాయి దినె నేమి కలు ద్రావె నేమి
నంజక ధన మిచ్చునతఁడె నా మెచ్చు
పల్లె త్తి యెలుకలఁ బట్ట నోపినను
పిల్లి శాస్త్ర మె మంటిపిల్లి యే చాలుఁ
గోరినధన మిచ్చి కొన రం డటంచు
నూరక మొఱనెట్టు చుండ నాపాలు
వారక నినుఁ గొన వచ్చిన వారి
తో రాయిడించి పోఁ దోల నీ పాలె
మలకలు మాని యీమాలని నేల
కలధన మిప్పింపఁ గలవె కాదేని
వెక్కు మాటలు గట్టి పెట్టి సత్యంబు
దక్కు బొంకితి నని తలఁగి పోయెదవు............................1460
బలువున నినుఁ ద్రాటఁ బట్టి పట్టణము
కలయఁ ద్రిమ్మర నాకుఁ గారణం బేమి
విను నా ప్రతిజ్ఞ నీ విత్త మంతటికి

..........................................................................................................

బెట్టుచుండుట నాభాగ పుపని, రాయి డించి పోఁదోలనీపా లె =క లహించి వచ్చి నవారిని పోఁదఱుముట నీ భాగ పుపనియా, మలకలు = వంకరనడతలు, త్రాటఁ బట్టి-పుస్తకపు త్రాటికిఁగట్టి, కలయన్ = అంతటను, ఇంతటికి నినుమడి పెట్టి