పుట:Haindava-Swarajyamu.pdf/242

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
234

హరిశ్చంద్రోపాఖ్యానము

బడయంగ వచ్చును భస్మతై లంబు
నిసుక నంటకముగా నివిరింప వచ్చు
రసము సేయఁగ వచ్చు రాలు గరంగి
రాదు నీ మనసు మార్దవము నొందింప
మేదినీనాథ యీమేలంబు లేల.......................................1320
లే లెమ్ము ధనము చెల్లింపు నీ'వనిన
భూలోక నాథుఁ డప్పుడు విచారించి
నక్షత్రకునిఁ జూచి 'నాదుర్గుణములు
లక్షలు వానిఁ బల్మఱు నేన్న నేల
నాలిని బుత్రుని నంగడిఁ బెట్టి
కాల కౌశికుఁ డనుకష్టున కమ్మి
కూర్చిన ధన మెల్లఁ గుదుకన గోలు
నేర్పుసఁ గైకొంటి నీకు సిద్ధించె
మునిశిఖామణితోడ మొరిగిన మితికి
ధనము: జెల్లించుచందము డెందమునకుఁ .....................1330
దలపోసి చూచితిఁ దక్కొండు గాన
నలవడ దటుగాన నాలస్య ముడిగి
నామీఁద వచ్చుధనం బెల్ల నీకు
నే మానవుం డిచ్చు నీమితిలోన
నతనికి బంటుగా నమ్ముకో నన్ను

....................................................................................................


దీయవచ్చును, పడయంగ ... తైలము= బూడిదలోనుండి నూనె సంపాదింపవ చ్చును, ఇసుక ... నివిరింపవచ్చు= ఇనుక ను వంటకముగా కరఁగింపవచ్చును, రస ము... గరంగి= రాలుగరంగి రసముఁ జేయఁగవచ్చు'నని యన్వయము. కరంగి=క రగించి, మార్దవము=మృదుత్వము, కుదుక గోలున నేర్పున = వంచన యొక్క నై పుణ్యము చేత, అలవడదు= అనువుపడదు, నామీఁదవచ్చుధనము= నన్ను అమ్మగా