పుట:Haindava-Swarajyamu.pdf/228

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
220

హరిశ్చంద్రోపాఖ్యాసము

బిడ్డల కొసఁగక పెండ్లాము కిడక...................................1060
వడి కిచ్చుచుఁ జీమ వలెఁ గూడఁ బెట్టి
ధన మంతయును మిండతల కి చ్చెవీని
గొని పోయి యెన్నఁడు కూలఁ గ్రుమెదరో
బాపురేయనుకొనఁ బని లేదు గాక
రూపింప నాకంటె రూపసి కలదె
యీప్రొద్దు నానిఁ గుయ్యిడ శిఖఁ బట్టి
వీఁపుతీటంతయు విడిపించి యెదుట
దక్కించి పోయిన ధన మెల్ల మగుడఁ
గ్రక్కింప కున్న నేకలహకంఠిక నె'
యనుచు రోకలిఁ గేల నమరించుచున్న..........................1070
గని రయంబున వెళ్లి కర్కోటకుండు
కడుసంభ్రమంబునఁ గాలకౌశికుని
యడుగులఁ బడి లేచి హస్తముల్ మొగిచి
'విచ్చేయుఁ డింక మీ వెఱు పెల్లఁ బాపి
వచ్చితి' ననుడు నవ్వటుధూర్తుఁ బొగడి
లోని కేఁగెడునంతలోఁ దల్పు మూసి
పూని గొండ్లెముఁ బెట్లి పోయె నా శిష్యు
డత్తఱిఁ జని కాంచె నా రాజు దేవి
చిత్తంబు జల్ల నఁ జిడిముడిఁ బడుచు

.....................................................................................................

తన కెక్కడిది, మిండతలకున్ = జారిణులకు, కూలఁగుమ్మెదరో = కూలునట్లు గ్రుద్దుదురో, అనుకొనఁబని లేదు గాక = నాకు నేనే నాయందమును చెప్పుకొనవల సిన యక్కఱలేదు గాని, రూపసి= అందకత్తె, కుయ్యిడ = అఱవఁగా, దక్కిం చిపోయిన ధనము = తనకువశము చేసికొని కొనిపోయి దారపోసికొన్న విత్తము,