పుట:Haindava-Swarajyamu.pdf/226

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
218

హరిశ్చంద్రోపాఖ్యానము

నోరు గా చెద నన్న నుడువుదు నీకు
జెప్పిన నొజ్జల చేఁ జావు నిజము
చెప్పకుండిన మాకుఁ జేటు నీ చేత
వెడల నాడిన దుర్వివేక ఈమాట
కడగి చెప్పినఁ గాని కడుపుబ్బు దిగదు
నాలుక నువుగింజ నానదు నాకు
జాలి నాతోడ నొజ్జలు సెప్పి యున్న
మాట నీ కెఱిఁగించి మదురుగో డైన
దాటి పోయెద నింక దాఁపుర మేల
రూపింప వికృతంపురూపు నీ రూపు........................1040
నా పత్ని కటుగాన నా కిటమీఁదఁ
గమనీయరూప రేఖలు గల కాంత
నమర నొక్క తే వివాహంబు గా వలయు
నని యొజ్జ లిట క్రింద నాడు వాక్యములు
వినిపింప నవి నీకు విరస మౌ నంచు


..............................................................................................................

నట్లు చేయించి, ఒజ్జసాని= భార్య, నోరుగా చెదనన్నన్నీ నోరు నేను జెప్పిన మాటను జెప్పకుండుసట్లు పదిలము గాఁ జూచుకొందునని చెప్పితివేని, పెడల నాడి వెలిపడునట్లు చెప్పినచో, దుర్వివేకము= వివేకము లేమి, కడుపుబ్బు దిగ దు= చెప్పకుండినయెడల కడుపు ఉబ్బుట తీసిపోవదు-ఆఱట అడఁగదనుట, నా లుక ... నాకు= నాకు నాలుకలో నువ్వుగింజకూడ నిలువదు - ఒక్కమాటయైనను వెలువడకుండ నేరదనుట, జాలిన్ = పరితాపముతో నిన్ను బ్రోలిన పెండ్లముకలి గెనని పరితాపముతో ననుట, మదురుగోడ = చుట్టుపారిగోడ, దాఁపురము దాఁచి పెట్టుట, వికృతంపు ... నాపత్ని కిన్ = నా పెండ్లమునకు నీరూపమువలె వికారమైన రూపము, కమనీయరూప రేఖలు = మనోజ్ఞ మైన యా కారలక్షణము లు, వినిపింప... నంచు= 'నీకువిరసమౌనంచు నవి వినిపింపను' అని యన్వయము.