పుట:Haindava-Swarajyamu.pdf/215

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

207


ద్వితీయ భాగము.

నెసఁగుశోకాగ్నుల నెరియుచు నున్న
వసుధీశుదీన భావంబు వీక్షించి
పురపురం జిత్తంబు పొక్క నందంద............................840
కరుణతో నారాజ కాంతాలలామ
సుతుఁడును దాను నేడ్చుచుఁ జను దెంచి
పతి పాదముల మీఁద భక్తితోవ్రాలి
కొడుకు మొక్కించి డగ్గు త్తికఁ బెట్టి
కడగోరఁ గాటుక కన్నీరు మీటి
పొణిపల్లవములు పరగంగ మోడ్చి
'ప్రాణేశ నేటితోఁ బాసితే మముఁ
బాయఁ ద్రోవలు 'నేసెఁ బ్రతిబంధ మకట
మాయురే కౌశికమాయాపిశాచ
మిది మొద లెందున్న నేమి నీయొద్ద..................................850
గదలవు నామనోగతులుఁ బ్రాణములు
నానోముఫలమున నాథ నీ వెలమి
నీనిఖిలోర్నియు నే లెదు మగుడ
నక్షత్రకుండు దుర్నయమున విప్ర
పడు మాడుట కాత బరి తాపపడకు

......................................................................................................

టుకకన్నీరు కాటుకతోగూడినకన్నీరు, మీటి= పోఁజిమ్మి , పాణిపల్లవములు== చిగుళ్ల వంటి చేతులు, 'పాయఁ. . . పిశాచము = విశ్వామిత్రుఁడనెడి మాయపు పి శాచి మనలను ఎడఁబాయునట్లు మార్గములుప న్నెను, మాయురే = ఔరా! మ నోగతులు=మానసవ్యాపారములు, నీయొద్దంగదలవు=నీ పొంతను విడిచిపోవు- ని న్నుఁదప్పమరొక్కటిని నామనస్సు ఎప్పుడు గాని తలఁచుకొనదనుట, నిఖిల- ఉర్వి= సమస్తభూమి, విప్ర పశుమాడుట = బ్రాహ్మణునిపక్షము గా తగవు చెప్పుట