పుట:Haindava-Swarajyamu.pdf/214

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
206

హరిశ్చంద్రోపాఖ్యానము

లెక్కడిదైవ మిం కెక్కడి సత్య................................820
మెక్కడిభూసురుఁ డేమి చెప్పెడిది
యెలమిఁ జుట్టమువలె నీ ధూరు వడుగు
పిలువనితగవుఁ జెప్పెద నని వచ్చి
కాలకౌశికునిపక్షము పల్కె వంశ
నాళ పన్నగ మాననము ముట్టి నట్టు
లీద్విజాధమునకు నీ యనాచారి
కీ 'ద్వేషచిత్తున కీ పిశాచమున
కీ, క్రూరకర్మున కీ యేభ్యరాన సి
కీ కష్ట చరితున కీ బహుభాషి.
కీ పల్ల వాధరి నీ కీరవాణి..................................830
నీ పుష్పకోమలి నీ పద్మగంధి
నీ చంద్రబింబాస్య నీనీల వేణి
నీ చకోరాక్షి నీయిభ రాజగమన
పులి మెడ గొరియఁ దెంపునఁ గట్టి నట్టు
లలవున దాసిగా నమ్ముకో వల సె'
నని వెచ్చ నూర్చి హా యని తల వంచి
కనుఁగవ బాష్పంబుకణములు దొరుఁగ

............................................................................................................

శపన్నగము= వెదురు గొట్టములోని పాము, జననము ముట్టినట్లు= మొగమునుదాం కినట్లు-గారడీఁడు వట్టి వెదురుగొట్టమును మొదటఁజూపి పిదప హస్తలాఘవ మున దానిని గదల్పఁగా' నందున్న కొయ్య పాము మొగమును దాఁకునట్లు. 'ఇట్లే నక్షత్రకుఁడును ఏమియుఁ గీడు సేయనట్లు తోఁపించి పిదపఁ గీడు చేసినాఁడ నుట ఎభ్యరాసి = దుష్టపం క్తిలో చేరినవాఁడు, పల్లవాధరి చిగుళ్ల వం టి పెదవిగలది, కీరవాణి: చిలుక వంటి మాటలుగలది, ఇభరాజగమన=మేటి యేనుఁగువంటినడగలది. గొరియ= గొర్రె కడగోరన్=కొనగోటితో,