పుట:Haindava-Swarajyamu.pdf/212

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

హరిశ్చంద్రోపాఖ్యానము

బటుబుద్ధిఁ దలపోయ బ్రహమంత్రంబు
పన్ని నచీకటిఁ బాపి వెళ్లింప
సన్న పుదీపంబు సాల దే తలఁపఁ
బిన్న వైనను బుద్ధి, పెద్దవు నీవు
మన్నించి మాన్పుము మావివాదంబు
నీ వెట్లు చెప్పిన నీ చెప్పి నట్ల..................................790
కావింతు' మనిన నకుత్రకుం డనియె
నిఖిలభూజనులకు నిజము నిష్ఠురము
ముఖము స్రుక్కింతురు మోవ నాడినను
బాడి దీర్చుట దొడ్డపని యగు నైనఁ
గూడదు పోలించి గోళ్లు రాయఁగను
మాకుఁ దోఁచినజాడ మానవాధీశ
యీకాంత విప్రున కీ వమునపుడు
బాలుఁ డీజట్టిలోపలివాఁడు గాఁడె
పోలఁ బుత్రున కింతఁ బొలఁతుక కింత
విలువధనం బని వేర్వేజ చెప్పి....................................800
తెలియ నాడక జట్టీ తీర్చితి గాన


...................................................................................................


వలన పాపము సిద్ధించుననుట, బ్రహ్మమంత్రంబు = బ్రహ్మమంత్రమువలె పవిత్రమై త్రోసిపుచ్చరానిదనుట, పన్నిన = అలముకొన్న, పెనుచీకటిని సన్న నీదీపము పోఁగొట్టునట్లు, మా పెద్దతగవును పిన్న పగునీవే తీర్ప నేర్తువనుట, ముఖము .... నాడినను = తుదముట్టన్యాయము తీర్చినయెడల మొగమును ముడుఁచుకొందురు. పాడి... నైన = అయినప్పటికిని అనఁగా ఎవరి కెట్లు పడినను, న్యాయమును తీర్చుట యే గొప్ప కార్యమగును, కూడదు పోలించి గోళ్లు రాయఁగను- నిజమును దెగునట్లు తీర్పు చేయక ఇట్లు అట్లు పోలికలు చెప్పి మిణకరించుచు గోళ్లురాసి" కొనుట యొప్పుదు, తెలియనాడక = విశదపడునట్లు చెప్పక, దక్కె = కాలకాశి