పుట:Haindava-Swarajyamu.pdf/211

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

203

ద్వితీయ భాగము.

కటకటా వెఱచునె కాలకౌశికుఁడు
కుటిలవిచార నీగూబజం కెనల'
నని యిట్లు బ్రాహణుఁ డామహీవిభునిఁ
గనలి తర్కింప నశుక్రకుఁ డనియె
'వసుధీశ యీవట్టివాగ్వాద మేల .........................770
మసలక మీలోని మలఁకలు వాయఁ
దగవు గావింతుఁ బెద్దలు మెచ్చి పొగడ
దగిలి మీ కది సమ్మతం బగు నేని
లక్షమాడలు ఇచ్చి లంచ మిచ్చినను
బక్షపాతము మాకుఁ బని లేదు గాన
మాట మాటకు బుట్టుమదిని జలంబు
' పాటించి చలమునఁ బ్రబలుఁ గోపంబు
ప్రాపించుఁ గోపంబు పాపంపుబొత్తుఁ
బాపంబు నరకకూపమునకుఁ 'దెరువు
గాన నీ మది దురాగ్రహమును గొంత
మాని నా చెప్పినమాట గ్రహీంపు'
మని చెప్పి ముద మందునా బ్రాహణునకు
మనుజనాథుండు సమతి నిట్టు లనియెఁ
'వటుశిరోమణి భవద్వాక్యంబు మాకు..........................780

..........................................................................................................

పోయినయెడల కోపించి నన్ను చండింతువా, గూబజం కెనల= గుడ్లగూబలవంటి కంటి బెదరింపుల చేత, మలఁక లు=రచ్చలు- అసమాధానములు, తగవు గావింతు = న్యాయము తీరును, మసలక ... బగు నేని 'తగవు మీకు సమ్మతంబగు నేని తగిలి మీలోని మలఁకలువాయ అది పెద్దలు మెచ్చిపొగడఁ గావింతు' నని యన్వయము. ప్రాపించు ... బొత్తు =కోపము పాపముతో డిసహవాసమును బొందును-కోపము