పుట:Haindava-Swarajyamu.pdf/21

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నాలుగవ ప్రకరణము.


స్వరాజ్యమనగా నేమి?


చదువరి: దేశీయమహాసభ భారతభూమికి జాతీయ భావమును కల్గించుటయు బంగాళ విభజనము ప్రబోధమును కల్గించుటయు అసంతృప్తి అశాంతులు దేశమున ప్రబలుటయు అను నీ విషయములను గురించి నేనిప్పటికి తెలిసికొనినాను. స్వరాజ్యమును గురించి తమ యభిప్రాయము లేవియో వినగోరుచున్నాను. మన ఇరువుర యభిప్రాయములును ఈవిషయమున నేకములు గావని నాకు దోచుచున్నది.


సంపా: మనమిరువురము ఈ స్వరాజ్యమనుపదమునకొకటే యర్థము చెప్పమనుట సంభావ్యము. నేను, మీరు, హైందవులెల్లరు, స్వరాజ్యము సంపాదింపవలయునని ఆతురులమై యున్నారము. కాని స్వరాజ్యమనగా నిదమిద్ధమని యెవ్వరును నిశ్చయించలేదు. ఇంగ్లీషువారిని ఇండియానుండి వెడలగొట్టుట స్వరాజ్యమని అనేకుల ముఖగళితమై యున్నది. కాని వారు అదే స్వరాజ్యమేల కావలయునో చక్కగా నాలోచించినట్లు లేదు. మిమ్ము నొక ప్రశ్న యిప్పుడే అడుగవలెను. మనకు