పుట:Haindava-Swarajyamu.pdf/205

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

197

ద్వితీయ భాగము.

గట్ట వచ్చు నె నిన్నుఁ గౌశిక మునికి'
నావుడుఁ జిఱునవ్వు నవ్వియా రాజు
“వావిరి మీబోటి వదరు పెద్దలకు
నుప దేశ మొనరింప నోపుఁ గా కిట్టి
విపరీత బుద్ధులు విన నింపు గావు
బుజ్జగింతలుఁ బొరి బొంకుమాటలును
మజ్జాతు లగువారిమాటలు గావు
జజ్జరికాడ నీచనుత్రోవఁ జనుము
నెరయ నీఁ గొన లేని నీవను వట్టి........................670
పరవమాటలు సహింపవు దల' మనినఁ
గాల కౌశికుఁడు భూకాంతుని సత్య
శీలంబునకు మదిఁ జిత్రంబు నొంది
పలికె నిట్లని 'మహీపాలక నీకు
వల నొప్ప నీదురవస్థలు దొలఁగు
వెరవుఁ జెప్పిన నీకు విరసమై తో చెఁ
బరికించి చూడ నీ భాగ్య మెట్టిదియు


.................................................................................................

నప్పటికిని విశ్వామిత్రునికి నిన్ను బంధింపశక్యమగునా? కావున బొంకి తప్పిం చుకొనుమనుట, ఓపుఁ గాక = శక్యమగును గాని, బుజ్జగింతలు బతిమాలుకొనియూఱడించుటలు, బొంకుమాటలు= అసత్య వాక్యములు - అనఁగా, ఇయ్యవలసి సధనమును ఇయ్య లేనని బతిమాలి బుజ్జగించుట గాని ఆధనమును తీసికొన్న దేలేదని బొంకు లాడుట గాని యనుట, మజ్జాతులు = నాజాతిగలవారు = క్షత్రియులు, జజ్జరి కాఁడ = పంచకుఁడా, నీచను త్రోవఁజనుము నీ దారిని నీవుపొమ్ము- లేని జోలి పెట్టుకొనకుమనుట, ఈ గొన లేనినీవు = నేను ఇయ్యంగా వెలయిచ్చికొన లేని వాఁడవగునీవు, వట్టి పరవమాటలు వ్యర్థము లైన పలుపమాటలు - -