పుట:Haindava-Swarajyamu.pdf/202

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
194

హరిశ్చంద్రోపాఖ్యానము

జాల మాయ పసిఁడిజలపోసనములు
లోహాచితంబు లె లోలత మించు-
నేహరంబులు గొన్ని నీలాల నమర
గుప్తంబుగా రాత్రి గొనిపోయి దీప
దీప్తి డొమ్మెఱుఁగుల దీపించు నట్టి
“రాజుల చెవిఁ బడి రవ్వ గాకుండ
Hజతో నివి దాఁచు డొండెడ'ననుచు
మొఱుగు మొజంగిన ముద్రగా ముడిచి
- తఱుచుగా లక్క ముద్రలు మీఁద నొ త్తి......................630
యాహికంబులు పెట్టి యవి దక్కు మితులు
సాహసంబునఁ బల్కి సారులఁ బెట్టి
ప్రబలంబుగా వడ్డీ పాజక మున్న
కుబుసంబులోఁ జే మగుడ్చు చందమున


.........................................................................................................

లు=లక్కబొందులు, మాయపసిఁడి జలపోసనములు= కాకిబంగారు మొలాములు, లోహాచితంబులు-ఇనుముతోఁ జేయఁబడినవి, నేహరంబులు= తావళములు, దీప... దీపింపన్ = దీపపు వెలుతురున ! తళతళమని క్రొత్త కాంతులు ప్రకాశించునట్లు. బూటక పుసొమ్ములు గావున పగటఁగాక రాత్రులందు దీపము వెలుతురున దానిక ల్లఁదనము వెలువడకుండునట్లు, రాజులు ... గాకుండ- రాజులువినిరా యీ సొమ్ము లుగయికొందురు గావున వారి చెవిలోఁబడి యల్లరి కానట్లు. దాఁచుఁడు=దా చి పెట్టుఁడు, మొఱగు మొఱంగి= మోసపుమాటపలికి, ముద్రగాముడిచి = కట్టగా కట్టి-విప్పియిచ్చినచోబూటకముబయలుపడుననిభావము,తఱుచుగా...నొ త్తి మిక్కిలియు లక్క గాల్చి విప్పకుండునట్లు ముద్రలు వేసి, యాహికములు=కుదు లు, మితులు సాహసంబునక్ పల్కి=గడువులు తప్పితే ఈయెట్టు ఆయెట్టు ఈ సాహసవాక్యములాడి, ప్రబలముగా .. మున్న = మిక్కిలిగా వడ్డ పెరుఁగకుము ను పె, కుబుసంబులో... చందమున- చేయి చొక్కొలోఁదూర్చి మరలఁ దీయ