పుట:Haindava-Swarajyamu.pdf/196

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

1

88

హరిశ్చంద్రోపాఖ్యానము


శ్రుతిసుఖంబుగ మతి శుష్కరోదనము
వితతంబుగా నేఁడు వినరా దదేల
నని తల పోయుచు నా హరిశ్చంద్ర
జన నాథుమాటలచంద మాలించి
'చిక్కెఁబో నేడు నా చే మత్తికాఁడు
చిక్కులఁ బెట్టి కౌశికుని మెప్పింతు
వెదక బోయినదీఁగ విస్మయం బొదవఁ
బదములఁ దగిలె నాభాగ్యంబుక తన
బెదరించి వీరల భేద మొందించి
యుదరి పోఁ దోలుదు నుర్వీతు నొండె............................... 540
మనసులో దయ వుట్ట మాటలు వన్ని
పనివడ బోధించి భావంబు గలఁచి
యింతి నమక యుండ నిపుడె మాన్పింతు
నంతట మితి దప్పు నడఁగు సత్యంబు'
నని మడిమెలు మోవ కతి సంభ్రమమునఁ
గునుకుచు సందడి గోపంబు నిగుడ
మూఁగిన ప్రజఁ గోల మొ త్తి దట్టించి
లోఁగక పాయఁ దోలుచుఁ జను దెంచి
తన మ్రోల నిల్వ నాతనిజన్ని దములు

...................................................................................................................

నుట. శుష్కరోదనము = కన్నీళ్లు లేని యేడ్పు, మ త్తికాఁడు = వెర్రివాడు - వెదకబోయినమష్యుఁడు తానే యెదురుప డెననుట, మడిమలు మోవక = కుదికా ళ్లు ఊనక - అతిత్వరితము గాననుట, కునుకుచు=కునిసినడచుచు, సందడిఁగోపంబు= జనులకలకలమునకుకోపము, దట్టించి = ఆదల్చి, 'పాయఁదోలుచుక్ = త్రోవయిచ్చు నట్లుతఱుముచు, గుఱుకొని= యత్నించి, తెలిసి మరికాని= తెలిసికొని యేకాక,