పుట:Haindava-Swarajyamu.pdf/185

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

177

350

ద్వితీయ భాగము.


రేకులతో నెదిరించుచెక్కిళ్లు
కంతుసంకుకు బొమ్మ గట్టినగళము
దంతికుంభముల నడల్చు పాలిండ్లు
చిగురుటాకుల నిరసించుహ స్తములు
గగనంబుతోఁ బరిఘాణించునడుము
తేఁటి టెక్కలదండఁ దెగడునూఁగారు
వాటమై తొక్కి నిల్వఁగ వచ్చుపిరుధు
లనటికంబముల గయ్యాళించుతొడలు
ననవిత్తు కాహళల్ నగుచిఱుదొడలుఁ
గెందామరల నేవగించుపాదములు
సుందరి గా దిది సొబగురాయంచ
యంచ గా దిది నడ పారుక్రైమించు
మించు గా దిది రాచమెచ్చుల ప్రతిమ...................360
ప్రతిమ గా దిది పచ్చి పగడంపులతిక
లతిక గా దిది నవలావణ్య సరసి
సరసి గా దిది పుష్పచాపునిశరము
శరము గా దిది రతి సవరించుచిలుక


-.................................................................................................... పెదవి, పసిఁడి రేకులు బంగారుతగళ్లు, కంతుసంకుకు = మన్మథుని విజయ శంఖమునకు, బొమ్మగట్టిన = జయించిన, దంతి = ఏనుఁగు, పరిఘాణించు = మాటాడు, దండ =సరము, గయ్యాళించు= ధిక్కరించు, చిఱుదొడలు=పిక్కలు, ఏవగించు =అసహ్యపడుకొను, సొబగు రాయంచ =సొగ సైన రాజహంసము, నడపొరుక్రొ మ్మించు=నడకగల క్రొత్త మెఱుఁగుఁ దీఁగ, రాచమెచ్చుల ప్రతిమ= మెచ్చుకొనఁ దగినరాచబొమ్మ, లతిక = తీగ, నవలావణ్యసరసీ = మనోజ్ఞ మైన లావణ్యరస మునకు, సరస్సు అయినది. పుష్పచాపునిశరము= మన్మథిని బాణము, రతిసవరించు