పుట:Haindava-Swarajyamu.pdf/184

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
176

హరిశ్చంద్రోపాఖ్యానము


చను చెప్పఁగాఁ గీరజయవాజి యెద్ది
యెఱుఁగ రా దీతనియెసఁగు తేజంబు
మరు పడ్డనిప్పుకమాడ్కి నున్నాఁడు
పరఁగ నీవిభుపదపంక్తి జాడలను
బరికింపుఁ డిదె సార్వభౌమచిహ్నములు
మరి చూడరము యీ మానినీమణిని
దెర వుచ్చునద్దంబుఁ దెగడెడు మోము
జాతినీలపురంగు జడిపించుకురులు
లేతచందురుఁ బిసాళించు నెన్నుదురు.........................340
మద చకోరములతో మలయు నేత్రములుఁ
గొదమ లేళ్లకు సిగ్గుగొలి పెడిచూపు
విరులవిండ్లకు నము వేసిన బొమలు
సరసచంపకము మెచ్చని నాసికంబుఁ
దెలి మొల్ల మొగ్గలఁ దెగడుపల్వరుస
పులకండ మొలికెడు బొమంచుమోవి
చీక టీ విరియించుచిఱునవ్వు పసిఁడి

....................................................................................................................

డు=మన్మథుఁడు, ననవిల్లు = పుష్పధనువు, కీరజయవాజి = చిలుక య నెడు జయప్రద మైనగుఱ్ఱము, మఱుపడ్డ కానివుఱుగప్పిన, పదపం క్తి జాడలను = అడుగుల వరుసల జాడలందు, పరికింపుఁడు = చూడుఁడు, తెర పుచ్చునద్దంబు = గవి సెనతీసిన యద్దము, జాతినీలపురంగు= మేలుజాతి నీలమణులవ న్నె లను, పిసాళించు=పోలు, మలయు=మాతాడు, కొదమ లేళ్లు=చిన్న లేళ్లు, సిగ్గుగొలి పెడు= సిగ్గుఁబుట్టించు, విరులవిండ్లకుక్ =పూలవిండ్లకు, అమ్ము వేసిన = బాణము దొడిగినట్టి- బాణము: దొడు గఁగా వంపు గా వండియున్న పూలవిండ్లవ లే బొమలున్న వనుట, సరసచంపకము= మేలైన సంపెఁగ మొగ్గను, నాసికంబు = ముక్కు, బొమ్మంచు మోవి =ఎఱ్ఱని