పుట:Haindava-Swarajyamu.pdf/183

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

175

ద్వితీయ భాగము.

నీ చూపు నీయేపు నిట్టి తేజంబు
నీ పెంపు నీసొంపు నీ ప్రతాపంబు
నీపోఁడి మీవాఁడి మీభుజాబలము
నెందు నెవ్వరియందుఁ నెన్నఁడుఁ గాన
మిందుక ళాధరుం డితఁడగు నేని
నందివాహనము పినాకంబు నేది
కణితోలు ఫణులకంకణహారములును
జుఱుకుఁగన్నును వాడిశూలంబు నెవ్వి ....................320
కరిరాజవరదుఁడు గాఁబోలు నితఁడు
కరిరాజవరదుఁ డీఘనుఁ డగు నేని
గరుడవాహన మెద్ది ఘన మైనయట్టి
సరసను నిజశంఖచక్రము లెవ్వి
పురుహూతుఁ డీఘనభుజుఁడు గాఁబోలు
పురుహూతుఁ డీఘనభుజుఁ డగు నేని
యిర వెండఁగా వెల్ల టేనుంగు నేది
కరమొప్పు నల వేయిగన్నులు నెవ్వి
మనసిజుఁ డీమహామహుఁడు గాఁబోలు
మనసిజుఁ డీమహామహుఁ డగు నేని
ననవిల్లుఁ బుష్పబాణంబులు నెవ్వి.........................330


ఏపు= విజృంభణము , పోఁడి మి= రూపము, వాఁడిమి= ప్రతాపము, ఇందుకళా ధరుండు= శివుఁడు,పినాక ము= త్రిశూలము కరితోలు =నల్లగజచర్మము , ఫణులకం కణహారములును = సర్పము లకడియములును హారములును, చుఱకుఁగన్ను = వేడి కన్ను - అగ్ని నేత్రము, కరిరాజవర దుఁడు= మేటియేనుఁగునకు వరమిచ్చిన విష్ణు దేవుఁడు, పురుహూతుడు= ఇంద్రుఁడు. వెల్ల టేనుఁగు= ఐరావతము, మన సిజుఁ