పుట:Haindava-Swarajyamu.pdf/182

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
174

హరిశ్చంద్రోపాఖ్యానము

‘భూమిళ మాటలఁ బొద్దుఁ బుచ్చెదవు
తామసం బేల ని త్తఱ వెరవేది
తరుణిఁ బాయఁగ లేక తల్లడించినను
నురి యుపాయముఁ జెప్పు మాధనంబునకు
జాగు సేయక పత్ని జట్టిగా నిచ్చి
నాగురు నాథుధనంబుఁ జెల్లింపఁ
జెచ్చెర లేచి వచ్చేదొ మౌనికడకు
వచ్చెదమో రావె వైళంబె' యనుచు
'నాసల బెట్టి నన్న డఁగింప వలదు
వేసాలు సేయక వేగ లె'మ్మనుచుఁ...........300
జేపట్టి తీవియ వచ్చిన వాని తెగున
కావసుధాధీశుఁ డొత్తలో రోసి
నిమిషంబు నచ్చోట నిలువక కదలి
రమణి నమ్ముటకునై రాజమార్గమున
జను దెంచు నప్పు డాజాను బాహులును
బెను పొందుమూఁపులుఁ బీనవక్షంబు
నురుతరస్కంధంబు నొజు పగు మేను
నరనుత సింహాసనస్థితుభంగి
నరుదార తెప్ప లల్లార్పక చూచి
పురజను లాత్త లోఁ బొదలు వేడుకల.........310
నీచంద మీయంద మారాజసంబు


ను, పెనుపుఒందు మూఁపులు = ? -బలుపుగల భుజశిరస్సులు, పీనపక్షంబు=బలుపుగల తొమ్ము, ఉరుతరస్కందంబు= మిక్కిలి గొప్పమూఁపు, ఒఱపు = అందము, నరను ...... స్థితుభంగిక్ = మనుష్యులచే కొనియాడంబడు సింహాససమరి దున్న వానివలె,