పుట:Haindava-Swarajyamu.pdf/181

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ద్వితీయ భాగము.

173

లక్కయై కరఁగదు లలన నాకిట్టి
చిక్కు వచ్చుటగొ నా చిత్తంబు మిగుల
ననద వై ని నిప్పు డమ్ముకొ మంచు
ననుమతిఁ జేసెద వకట నా గుండె
తూలదు వీలదు తునియలై పోవ
దోలంపుముద్ద గా దోపువ్యుబోఁడి
వనజాక్షి నినుఁ గూడి వర్తించు ఘోర
వనములు శృంగార వనములు నాకు.......280
మగువ నీ వున్న కోమలతృణశయ్య
తగుహుసతూలికాతల్పంబు నాకు
గలకంఠి నీ పొందు గలగిరిగుహలు
సలలిత మణిచంద్రశాలలు నాకు
మలయజగంధి ప్రేమమున నీ ఫెసఁగు
ఫలకందమూలముల్ బహువిధాన్న ములు
జలజాక్షి నేఁడు నాసామ్రాజ్యలక్ష్మి
తొలఁగి పోయినరీతి దోఁచుచున్నదియు'
ననుచు నాందోళింప నతనిఁ గ్రోధమునఁ
గనుఁగొని మఱియు నక్షత్రకుం డనియె...........290


“లక్కయై... నాచి త్తంబు' - 8 నాచి త్తంబు నాకిట్టి చిక్కు వచ్చుటకో లక్కయైక రఁగదు- నామనస్సులక్క వలె కరఁగకున్నది; నేనిట్టి చిక్కు పడ వలసియున్నందుపలన నేమో అదియట్లు కరఁగకున్నది. అనదవై = అనాథ పై, తూలదు= చెడదు, ప్రీలదు=పగులదు, ఓలంపు శుద్ద గాడు= గందపము గాదు. గిరిగుహలు.కొండబిలములు, సలలితమణి చంద్రశాలలు = మేలయినరత్నముల 'ఁగట్టఁబడి నమి ధైటిండ్లు, మలయజగంధి ఇచంద సమువంటి వాసనగలదానా, ఆందోళింపక్ =మిణకరింప,ఆజాను బాహులును = మోకాలిషఱకు నందు చేతులు