పుట:Haindava-Swarajyamu.pdf/178

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
170

హరిశ్చంద్రోపాఖ్యానము


పతి యెట్టికష్టంపుఁబని సేసి యైన
సతిఁ బ్రోచు టిది ధర్మశాస్త్ర సమ్మతము.............................220
యాలి నమ్మినకష్టుఁ డనుచు నెల్లెడలఁ
జాల నిందించుచు జను లేవగింప
వదనాంబుజము వంచి వసుధఁ బెక్కేండ్లు
బతి కెడియామాల బ్రతు కేటి బ్రతుకు
పడతి నేనిట్టు నిన్ బతిమాలి యమ్మి
పడయఁగాఁ దగు నింద్రపదవైన నొల్ల
లెక్కింప నపకీర్తి లేనిజీవనము
నిక్కబుగా నొక్క నిమిషంబె చాలు
నొఱలంగఁ బ్రాణుల నొ త్తి కుత్తుకలు
గరగర దేఇగెడికటిక వాఁ డైన .........................................330
దయ లేక తనకళత్రము నమ్ము కొను నే
నయ మేది దీనికి నా మది సొరదు
ధనమున కై పత్ని దాసిగా నమ్మి
చనునె భర్తకుఁ గూడు చవి యని కుడువ
మరణంబు మేలు నెమ్మదిదీనికంటెఁ
బరికింప ననుడు నప్పడతి యిట్లనియె
'నాపద వచ్చినయప్పుడే మున్ను
దాఁపినధన మిచ్చి తగుఁ బత్నిఁ గావ


....................................................................................................

లబ్రతుకు= అతినీచపు బ్రతుకు , ఓఱలంగన్ = విలపించునట్లుగా, కళత్రము=భార్య, నయము ఏది= మెత్తనవిడిచి, చనునె . గుడువ - 'భర్తకుఁ గూడుచవియని కుడువఁజ నునె' అనియన్వయము. ఆపద ... గావఁ జనును = విపత్తు కలిగిన సమయమందే ముందు తాను దాఁచి పెట్టుకొన్న ధనమిచ్చి తనభార్యను గాపాడఁదగును. ప