పుట:Haindava-Swarajyamu.pdf/176

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
168

హరిశ్చంద్రోపాఖ్యానము


దాయంబుతల నిట్టిదైన్యంబు దగునె
మతిఁ బూని నీ సత్య మహిమ పెంపొంద
మితి రెండు దినములు మీఁద నుండఁగనె ................................190
చొప్పడ నప్పు దీర్చుట మేలు దినము
లొప్ప నొండొక టెక్క నొక్కటి దఱుఁగు
నుడితప్పు వాతప్పు నుసలక సత్య
“మెడలింపఁ గని పెట్టు నెపుడుఁ గౌశికుఁడు
శిశువులు వాపోవఁ జెక్కిలి మీటి
విశ దాత్త పాలుఁ ద్రావించుచందమున
నుసలక మన వెంట నుండి యీయప్పు
కసటు వాపఁగ నేఁడు గలిగె నీ ఎడుగు
నింటి వేలుపు మన కితఁ డింక నెన్ని
కంటకంబులు వల్కుఁ గా కేమి దీనఁ ..........................................200
బేద నేనని నోరఁ బ్రేవులుఁ జూప
బోదు రే ఋణముఁ దెంపునఁ గొనువారు


...................................................................................................

కటిఎక్కన్ = ఒక్కొక్కటి జరుగ గా, ఒక టి తఱుఁగుక్ = ఒక్కొక్క దినము గడువులోతగ్గును, సుడిత ప్పు =మాటతప్పు, వాతప్పు= నోటితప్పు, చెప్పినమాటత ప్పుటయు, చెప్పరానిమాట చెప్పుటయునని రెండుతప్పులు, నుసలక = ఆలస్యములేక, సత్యము ఎడలింపన్ = సత్యమును తప్పించుటకై నుడి తప్పును వాతప్పును గని పె ట్టుననుట. చెక్కిలిమీఁటి= చెంపపుడికి, అప్పుక సటు= ఋణదోషము, పడుగు= వటుఁడు, ఇంటి వేలుపు = గృహదైవము, గృహదేవతవ లె దగ్గజ నేయుండి శుభ ములిచ్చువాఁడనుట. కంటకములు=కఠిన వాక్యములు, పల్కు 'గాక = పలికినను పలుక నీ, ఏమిదీన = దీనివలన నేమిగ లుగ గలదు, పేద నేను అని నోరణ ప్రేవులు చూషణ్ = నేను పేదవాఁడను అని కడుపులోని పేగులు దెలియునంత విరివిగా నోరు దెఱచి బతిమాలుకొన్న ను, పోదు రే ఋణము తెంపునఁ గొను