పుట:Haindava-Swarajyamu.pdf/173

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ద్వితీయ భాగము.

165

బాగుగా నొసపరి బాగు నటించు
నా దేవ దేవుని యానందమూర్తి
మోదంబుతోఁ జిత్తమున నిల్పి యొక్క
మఱియు నచ్చట మణిమంత్రౌషధములఁ
గజవక యుండ వాకట్టి సింహముల.................................140
శరభంబులను ఘోరశార్దూలములను
వెర వారఁగా నెక్కి విహరించి యజన
విరచితాసనభద్రవిన్యాససరణి
నరుదుగా నాసీను లై యణిమాది
సిద్ధులు గలిగి ప్రసిద్ధు లైనట్టి
సిద్ధుల నిష్టార్థ సిద్ధిగాం గొలిచి
మగుడి భూవిభుఁ డొక్కమఠముపొంతకును
దగఁ జేరి యున్నయ త్తతి నిప్పులురుల
వీక్షించి యమ హీవిభునితో ననియె
నక్షుత్రకుఁడు మది నయమింత లేక.............................150
'యచ్చుగా మాగురుం డవనీశ నీకు
నిచ్చినమితి నేఁడు నెల్లియుఁ జిక్కె
బచ్చ పైకము గూడఁ బడినది లేదు

...................................................................................................

లు=యోగ సిద్ధులు మెట్టు పాదుకలు, ఒసపరి బాగు శృంగార వంతునివిధము, వా కట్టి=నోరు బంధించి, శరభము= ఎనిమిది కాళ్ల మృగము, శార్దూలము= పెద్దపులి, అజిన... సరణిః" = అజిన-కృష్ణాజినము చేత, విరచిత = చేయఁబడిన, ఆసన-=ఆ సనము యొక్క , భద్ర=శుభ మైన, విన్యాస = రచన యొక్క, సరణిన్ =విధ మున, నిప్పులు ఉరులన్ కన్నుల నిప్పుకలు రాలగా, నయము = మెత్తదనము, ఇచ్చినమితిక్ = పెట్టినగడువులోపల, నేఁడును ఎల్లియుణ్ చిక్కె ను = నేఁడు - రేపును మిగి లెను, పచ్చ పైకము= బంగారు వైకము, కూడఁబ