పుట:Haindava-Swarajyamu.pdf/172

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
164

హరిశ్చంద్రోపాఖ్యానము

మని సన్నుతులు సేసి యచ్చోటు వాసి
మనమార నా చంద్రమతియును దాను
భుక్తి ముక్తులు రెండుఁ బోలంగ నొసఁగు
భక్తవత్సలుఁ గాలభైరవుఁ గొలిచి
భసిత త్రిపుండ్రంబు ఫాలలోచనము
నిశిత త్రిశూలంబు నీలకంఠంబు
భోగీంద్రహారంబుఁ బునుకక ప్పెరయు
నాగకంకణమును నల్ల నిమేను
మరులు కెంజడలును మణికుండలములుఁ
జిఱుగజ్చెమొలనూలు సింగినాదంబు
డాకాలి పెండెంబు డమరువుఁ గత్తి
రాకాసితలలతోరపువనమాల
సెలవిపై ఁ జిఱునవ్వు చిలికెడుమోముఁ
గలిగి యుజ్జ్వలరత్న ఖచితంబు లైన
యోగ వాగలు మెట్టి యొక పాద మూఁది.......................130

.......................................................................................................

ము ఉపాయము,భసితత్రి ఫండ్రంబు = బూదిమూఁడు రేకలు, ఫాలలోచనము = నో సటికన్ను, నిశిత త్రిశూలంబు నాఁడియైన త్రిశూలము, భోగీంద్రహారంబు సర్ప శ్రేష్ఠుఁ డైన వాసుకి అనెడు హారము, పునుకక ప్పెర = కపాలపాత్ర, నాగ కంకణము = సర్పముల కడియము, మరులు కెంజడలును = మోహముగొలి పెడు ఎఱ్ఱనిజటలును, చిరిగజ్జె = చిన్నగ జ్జెలు, సింగినాదంబు = పొడదుప్పికొమ్ముతో చేయఁబడిన యోగుల సుషిర వాద్యవి శేషము, డాకాలి పెం డెంబు = ఎడమ కాలి పెండేరమును, డమరుగము, రాకాసి.. పనమాల-రాకాసితలల= రాక్షసుః శిరస్సుల చేత నెన, తోరపు = పెద్ద, వనమాలయు, సెలవి = పెదవిమూల, ఉజ్జ్వ లరత్న ఖచితము = ప్రకాశించురత్న ముల చే పొదుగ బడినది. యోగ వాగ