పుట:Haindava-Swarajyamu.pdf/171

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ద్వితీయభాగము.

163

నగణితకనక కుంభాభిరామంబు
నగు విశ్వనాథమహా దేవునగరుఁ
జేరి యా దేవుని శ్రీలింగమూర్తి
గోరి సద్భక్తి నెక్కొనఁగ దర్శించి
ధరణిఁ జాఁగిలి మొక్కి తనమోడ్పుఁ గేలు
గర మొప్ప ఫాలభాగంబునఁ జేర్చి....................110
జయ భక్తమందార సజ్జనోద్ధార
జయ సద్గుణాధార సంసారదూర
జయ సత్కృపాలోల శాతత్రిశూల
జయ హుతాశన నేత్ర జలజాక్షమిత్ర
జయ మేరుకోదండ జయ విష్ణు కాండ
జయ నిర్జి తొనంగ శశిధవళాంగ
చారుకోమలహాస చతురవిలాస
గౌరీమనోల్లాస కాశీని వాస
యీ కౌశికునిఋణం బీకాశిలోన
దీకొని తీర్పఁగాఁ దెరువు గల్పింపు'....................120

..............................................................................................

అగణిత = లెక్కింపరాని, కసక కుంభ = బం గారుక లశముల చేత, అభి రామంబు=మనోజ్ఞమైనది, భ క్తమందార = భక్తులకు కల్పవృక్షమువంటివాఁడా, సజ్జన ఉద్ధార = సత్పరుషులను ఉద్ధరించువాఁడా, శాత= వాఁడియైన, హుతాశన నేత్ర = నిప్పుకన్ను గలవాఁడా, జలజాక్ష మిత్ర = విష్ణువునకు చెలికాడా, మేరుకో దండి= మేరుపర్వతము విల్లుగాఁగలవాఁడా, విష్ణుకాండ = విష్ణువు బాణముగాఁగ లవాఁడా, నిర్జిత అనంగ జయింపఁబడిన మన్మథుఁడుగలవాఁడా, శశిధవ చంద్రునివలె తెల్ల నిఅంగములు గలవాఁడా, చారుకోమలహాస = సొగసై మృదువైన నవ్వుగలవాఁ దీకొని= ఎదుర్కొని పూని, తెరువు=మార్త