పుట:Haindava-Swarajyamu.pdf/169

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

161

ద్వితీయ భాగము.

వలుఁదశూలము నశి వనమాలిక యును..........................80
గలయిత డాత డై 'కమనీయరత్న
కలిత మై తలఁచిన కడలనే మెలఁగు
నతులవిమానంబు నందు దన్నెలమిఁ
బ్రతిదినంబును ససంభ్రమముగాఁ గదిసి
యొసపరినన్నెలు నోరచూపులును
ముసిముసినగవులు మొగడచన్నులును.
నసియాడునడుములు నలసయానములు
రస మొల్కుబింబాధరంబులుఁ గలిగి
యలరువిత్తుని మోహనా స్త్రంబు లనఁగ
నలరారురుద్రక న్యాసహస్రములు
వివిధ భంగులం గొల్వ వినుతికి నెక్కి
శివలోక మున సుఖస్థితి నుండఁ గాంచు'
ననుచుఁ జిత్రంబుగా నచ్చటి మహిమ
మన మార నాచంద్రమతికిఁ జెప్పుచును
ధవళగోపుర చతుర్ద్వార బంధురము....................................90

.......................................................................................................

అస్థివనమాలిక = ప్రేవులమాల, ఇతఁడు ఆతఁడై = ఇచట మృతిఁబొందినవాఁడు శివునిలక్షణములను బొంది ఆశివుఁడేయై- శివసారూప్యమును బొందియనుట, కమ నీయరత్న కలితము= మేలయినమణులతో పొదుగఁబడినది, తలఁచినకడల నే తలఁచుకొన్న చోట్ల నే, ఒసపరి వన్నెలు = సింగార పువగలు, 'మొగడచన్ను లు= మొగ్గలవంటి పాలిండ్లు, అసియాడు-జవ్వాడు, అలసయానములు= మెల్లనినడ లు,బింబాధరములు దొండపండువంటి పెదవులు, అలరువిత్తుని మోహనాస్త్రములు= మన్మథుఁడు జగత్తును మోహింపఁజేయుటకై వేయు బాణములు, ధవళ ... బంధురము ధవళగోపుర = తెల్లనిగో పురముల చేతను, చతుర్ద్వార =