పుట:Haindava-Swarajyamu.pdf/164

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

హరిశ్చంద్రోపాఖ్యానము

ద్విపద

ద్వితీయభాగము


మనుజేశు డంత నమ్మగువ నీక్షించి
'మనకు నేఁ డిచ్చోట మసలుట దగదు
ముందఱ నున్నది ముయ్యేఱునేల[1]
యం దున్నజనులు మహాజను[2]' లనిన
వనిత యిట్లనుఁ బ్రాణవల్లభుఁ జూచి
“పెను పొందుతత్పురిపే రేమి దేవ
యొనరంగ నే[3]లెడియొడయుఁ[4] డెవ్వాఁడు
మన కెవ్వ రందు సంబంధబాంధవులు
మనయప్పు తెగటార్ప మది వేఁడువారి
వినిపింపు వారల విమలాత్మ' యనినఁ10
జందనగంధి కాజననాథుఁ డనియె
'నిందుకళాధరుం డే[5]లు నప్పురము
నావిశ్వనాథుఁడే యాత్మబాంధవుఁడు
దైవంబుఁ ద్రాత[6]యు దాతయు మనకు

  1. ముయ్యేఱునేల ='త్రిస్రోతాః' అన్నట్లుమూఁడు ప్రవాహములుగా గంగానది ప్రవహించు స్థలము
  2. మహాజనులు = గొప్పవారు - పుణ్యాతులనుట
  3. ఒనరంగన్ = ఒప్పునట్లుగా
  4. ఒడయుఁడు = ఏలిక - ప్రభువు
  5. ఇందుకళాధరుఁడు= శివుఁడు
  6. త్రాత = రక్షకుఁడు