పుట:Haindava-Swarajyamu.pdf/162

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
154

హరిశ్చంద్రోపాఖ్యానము

బ్రదుకుపతి వ్రతారత్నంబులకును
బతి లేని రాజ్యసంపద లవి యేల
పతి లేనిసుతు లేల బంధువు లేల..............................2430

పతి లేనిహితు లేల ప్రాణంబు లేల
మతిఁ దలపోయ నీ మానవేశ్వరుడు
కూర్మి నిలుకడ నా తోడునీడ
సాకన్న పెన్నిధి నా నోముఫలము
నా మేలి చెలికాడు నా పట్టుఁగొమ్మ
నా మెచ్చువల రాజు న న్నేలు రాజు
చిక్కు నే కౌశీకుచిక్కులఁ దగిలి
'వెక్కురువడుగ యీ వెడమాట లుడుగు
నీవు నీ గురుఁడును నిఖిలనిర్జరులు
వేవేల దెఱఁగుల వినుతులు సేయ...................................2440

జగ మెఱుంగఁగ హరిశ్చంద్రభూవిభుఁడు
నెగడుసత్యవ్రతనియతిఁ బెం పొంది

..................................................................................................................

క్రమమునోర్చుట కష్టమనుట, ఈ విధమును గాక = ఈప్రకార మే కాక - అనఁగా నింతవఱకు పతిని బాసిన స్త్రీకి వలపు చేఁగ లుగు పట్టి బాధలు చెప్పియిప్పుడు పాతివ్ర త్యధర్మమునుబట్టి కలుగు నభోగ్యములను జెప్పుచున్నది, నాకూర్మినిలుకడ= నా ప్రేమము ఎడ తెగక నెలకొని యుండు స్థానము, నాతోడునీడ = నన్ను తోడు నీడవలె నెడఁబాయనివాఁడు, నాకన్న పెన్నిధి = నా కుదొర కిన పెద్దలిబ్బి- పెద్ద విధివ లెనాకుఁ బెంపుసొంపులన్ని యుఁ జేయువాఁడు, నానోముఫలము= నేను నోఁచిననోములకు ఫలముగా నుండువాఁడు, నా మేలి చెలి కాఁడు =నాకు మేల, యిన స్నేహితుఁడు, నాపట్టు గొమ్మ= నాకు ఆధారభూతుఁడు, నా మెచ్చు. వలరాజు= నేను మెచ్చిన మన్మథుఁడు, కౌశికు చిక్కులక్ తగిలి చిక్కు నే' అని యన్వయము. కౌశికుఁడుపెట్టుసంకటములందుఁ బడియు నియమముతప్పఁ

.