పుట:Haindava-Swarajyamu.pdf/161

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రథమభాగము.

153

.

కూతలు ఘాతలు గొదమతు మెదల
మ్రోతలు చేతలు ముద్దురాయంచ
మురువులు పరువులు మోహంపుఁ జెలుల
సరసముల్ విరసముల్ చందనానిలపు
మెలఁకువ యలఁకువ మేలి, చెంగావి
జిలుగులు సిలుగులు చివురుఁజప్పరపుఁ.......................2420
బొంతలు వింతలు పూఁబొదరిండ్ల
క్రంతలు వంతలు కమనీయ సరసి
బిసములు నుసములు పృథుమక రంద
రసములు విసములు రమ్యహిమాంబు
పూరంబు గాదు కర్పూరంబు సేఁదు
వీరుండు మారుఁ డీవిధమును గాక
ముదమునఁ గులశీలములు మదిఁ గోరి


......................................................................................................................

చిపోవఁబడునవియనుట, పర భృతసమితి = కోవెలలసమూహము, ఘాతలు= దె బ్బలు- దెబ్బలవ లెగడు సైనవి, వ్రేతలు= దెబ్బలు, మురువులు ఇనడలమురిపములు, పరువులు=పరుగెత్తిపోవునవి - దూరముగా పలాయిత ములగుననుట, చందన అనిల పు=చందనపుఁగొండనుండి వీచుగా లియొక్క, మెలఁకువణ సంచారము-వీచుట, అలఁకువ - ఆయాసము - ఆయాసకరమనుట - జిలుగులు = సన్న వస్త్రములు, సిలు గులు= ఉపద్రవములు, చివుకు చప్పరపు పొంతలు= చిగురుటాకుల తోపన్ని నచౌ క పుపందిరి యొక్క సమీపనులు, వింతలు= ఆశ్చర్యము- అనుభ వించుటయరుద నుట, క్రంతలు=రచ్చలు- - స్థానములనుట, వంతలు=దుఖములు-దుఃఖకరముల నుట.కమనీయసర సి=మనోహర మైన కొలనుయొక్క,బీసములు= తామరతూండ్లు, నుసములు=క నరులు, పృథుమకరందరసములు= గొప్ప పూఁదే నిద్రవములు,రమ్య హిమాంబుపూరంబు = మేలైన పన్నీటిముంపు, కాదు = ఇష్టము గాదు, మారుఁడు వీరుండు = మన్మథుఁడో పరాక్రమశాలి- పురుషునిఁ బాసిన స్త్రీకి మన్మధునిపరా