పుట:Haindava-Swarajyamu.pdf/160

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
152

హరిశ్చంద్రోపాఖ్యానము


పతియ చూ దైవ, మెబ్బంగుల సతికి
బలవంత మగువిధి ప్రాణేశుఁ బాప
వలవంతఁ జెందినవరవధూమణికి
భారంబు హారంబు భాసురగంధ
సారం బసారంబు సారకాసార
తీరంబు దూరంబు తీవ్రసల్లాప
కీరంబు క్రూరంబు కిన్నర మంజు
నాదంబు భేదంబు నవచంద్ర కాంత
వేదులు సూదులు విరచితో ద్యాన
చూతంబు భూతంబు సురభిక సూరి
పూతలు రోతలు పూర్ణ చంద్రికల
మెఱపులు వెఱపులు మెత్తని దూది
పఱుపులు మఱుపులు పరభృతసమితి

.......................................................................................................

చర్చింపన్ =విచారింపఁగా, పాపన్=ఎడఁ బాపఁగా, వలవంతన్ =దుఃఖమును, వరవమణికిన్ - ఉత్తమురాలైన స్త్రీరత్నమునకు, హారము, భారంబు= బరువు, భాసురగంధ సారంబు=మనోజ్ఞ మైనచందనము, అసారంబు=పసలేనిది, సార కాసార తీరంబు = శ్రేష్టమైన సరస్సుయొక్క గట్టు,దూరంబు=దవ్వయినది - పోవనొప్పనిది, తీవ్రసల్లాపకీరంబు=వడిగల పలుకులుగ ల చిలుక , క్రూరంబు=కటు వైనది,కిన్నరమంజు నాదంబు= కిన్నెరవీణ యొక్కయింపయినధ్వని, భేదము = దుఃఖము-దుఃఖకరమనుట. నవచంద్ర కాంత వేదులు = క్రొత్తలై చంద్ర కాంత శిలలయముఁగులు, సూదులు= సూదులు లే నొప్పించునని, విరచిత ఉద్యాన చూతము=చక్కఁగా నేర్పరుపఁబడిన ఎలతోఁటయందలి మామిడి, భూ తంబు=భూత మువలె భయంకరమైనది, సురభి కస్తూరి పూఁతలు= వాసనగల కస్తురిపూతలు అసహ్యములు, పూర్ణచంద్రికల మెఱపులు= పండు వెన్నెల ప్రకా రోతలు -అసహ్యములు, వెఱపులు=భయంకరములు, మజుంపులు=మఱపునకు పాత్రములు - మర