పుట:Haindava-Swarajyamu.pdf/159

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రథమభాగము.

151

కుటిల కౌశికు తీవ్రకోపొగ్ని శిఖలఁ
బెట పెటఁ బ్రీలక ప్రిదిలి పో వశ మే
యదియును గాక నేఁ డాదిగా నింకం
బదిదినంబులు సిక్కెఁ బలికినమితికి
మునినాథుధన మెట్లు ముందజఁ జెల్లు
వెనుకఁ జెల్లిన దఱవీ సంబు లేదు
లే దుపాయం బింక లేశమాత్రంబు
మేదినీపతి కిట మీఁద నూహింప
నోదవు పేరాకట నుదరి హుమ్మనుచుఁ
గదియు బెబ్బులివ లెఁ గౌశికుఁ డలిగి
తడయక వచ్చి మాధనముఁ దెమ్మనుచు
నడిగి యజ్ఞాని బి ట్టదలించెనేని
కడువడి గర్భంబు గదలి కంపించి
సుడివడి నిన్ను నీ సుతుని నక్కఱకుఁ
యినంతకు నమి పుచ్చు భూవిభుఁడు
తోయజానన నాకుఁ బోఁచినబుద్ధి'
నావుడుఁ జిఱునవ్వు నవ్వి యారాజు
దేవి నక్షత్రకు దెసఁ జూచి పలికె....................................2400
'సతి కేడుగడయును జర్చింపఁ బతియె

.............................................................................................................


విశ్వామిత్రునియొక్క, పెట పెటఁబీలక = పెట పెటమని మాఁడక , ప్రిదిలిపోన్ = జారి తప్పించుకొనిపోవుటకు , నేఁడాది గాన్ = నేఁడు మొదలుకొని, చిక్కె = మిగిలెను, మితికి -గడువునకు, ముందఱుక్ =ఇఁకమీఁద, వెనుకళా = ఇంతకు ముందు, ఉదరి=చలించి, అర్రు ఆని= - మెడపట్టుకొని, సుడివడి తబ్బిబ్బుపడి అక్క ఱకు = ఆవశ్యకతకు- లేక - ఆవశ్యక కార్యమునకు, ఏడుగడ=స్వామి, -