పుట:Haindava-Swarajyamu.pdf/158

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
150

హరిశ్చంద్రోపాఖ్యానము

క్రమజ నాకుఁగాఁ గైకొని రాజ్య
మిముల నీ కిచ్చి యీ లోహితాస్యుఁ................................2370
బట్టంబు గట్టింతుఁ బరఁగ నీ ముద్దు
పట్టిఁ దోడ్కొనుచు నీ పట్టణంబునకు
రమ్మునీ కిది పొందు రాదన వలదు
నమ్ముము మృష గాదు నా మాట లతివ
యెలమిమై నటు గాక యీరాజు వెంట
నలయక వర్తింప నాశించే దేని
వనహు తాశ నమహా జ్వాలాకరాళ
ఘనతరవిస్ఫులింగముల నంగములు
గమరక పోవచ్చుఁ గాక కల్పాంత
డమరు నిష్ఠుర ఢమఢమ రవ స్ఫురిత.............................2380
పటుతర బ్రహ్లాండ భాండ చండీశ
చటుల రౌద్రాకృతి సమకొనఁ బేర్చు


.............................................................................................................. కౌశికసంయమి :=విశ్వామిత్రమునిని, “నాకుఁగా రాజ్యము క్రమ్మఱఁ గైకొని నీ కిమ్ములనిచ్చి' అని యన్వయము, పొందు గాదు= ఉచితము గాదు. మృష =కల్ల, వన ...హుతాశన ... విస్ఫులింగములన్ వనహుతాశన = 'అడవినిప్పు యొక్క మహా జ్వాలా = గొప్పమంటలయొక్క, కరాళ = భయంకరములైన, మనతర విస్ఫులింగములన్ . మిక్కిలిగొప్పవైన మిడుఁగుఱుల చేత, కల్పాం... రౌద్రాకృతి-కల్పాంత = ప్రళయమందలి, డమరు డమరు వాద్యము యొక్క , నిష్ఠుర = కఠోరమైన, ఢమఢమరవణఢమఢమయనుశబ్దము చేత, స్ఫురిత = అల్ల లార్పలు డిన, పటుతర = మిక్కిలిపటు వైన, బ్రహాండభాండ = కుండలవంటి బ్రహాండ ములుగలవాఁడైన - తనడమరు మ్రోఁతల చేత బ్రహ్మాండముల నల్లలార్చువాఁడైన యనుట, చండీశ - శివునియొక్క, చటుల= మిక్కుటమైన, రాద్రఆకృతి= భయం గరమైన ఆకారము, సమకొనన్ = జతపడునట్లుగా, కుటిల కౌశికు = పంచకుఁ డైన


-