పుట:Haindava-Swarajyamu.pdf/157

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రథమభాగము.

149

లేకున్నఁ గొన సాఁగ లేవు నిక్కువము................................2350
సేయు సూపని కార్యసిద్ధి నా కోదవు
పోయి వచ్చెద'నని పోయె నమ్మౌని
యంత నక్షత్రకుం డామహారాజు
కాంతాశిరోమణిఁ గాంచి దీవించి
దేవి నీ దైన పాతివ్రత్య మహిమ
వేవేల దెఱఁగుల వినుతింప నరిది
యనలకీలావళి కాహుతి యైన
ననుఁ బ్రాణములు గాచి నయమునఁ బ్రోచి
తీక్ష!తి స్త్రీలలో నెన్నఁగా 'మొదలి
పక్ష. మేర్పడఁగ లోపాముద్ర నెన్ని
యాయరుంధతిఁ జెప్పి యనసూయఁ బొగడి
'శ్రీ యలరార శచీదేవిఁ దలఁచి
యలవడఁ గొనియాడ నగుఁ గాక యున్న
పొలఁతులు నీతోడఁ బురుడింపఁ గల రే
కరుణమై నీ యుపకారంబు నాకుఁ
బరఁగఁ జేసిననీకుఁ బ్రత్యుపకార
'మొనరఁ గావించెద నొకమాట వినుము
చనవుమైఁ గౌశిక సంయమి వేడి


.................................................................................................................

ననియన్వయము, సురసమై= మిక్కిలి రసవంతముగా, అనల కీల ఆవళికి = అగ్ని జ్వాలలవరుసకు, ఆహుతి=బలి, "మొదలిపక్షము, = మిక్కిలి మేలయినతరగతి, ఏర్పడఁగాన్ = తేటపడునట్లు, మొదట అరుంధతి మొదలుగా శచీదేవివఱకుఁ గలపతివ్రతల నెన్ని వారితో పోటిగా నిన్ను ను ఎన్న వలయునుగాని, ఉన్న పొలఁతులు=తక్కియున్న ' కేవల స్త్రీలు, పురుడింపన్ సరిపోల,