పుట:Haindava-Swarajyamu.pdf/147

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రథమభాగము.

139


జావక పో రాదు చర్చించి చూడ.........2160
ధరణీశుఁ డగునాకు దర్ప మేర్పడఁగఁ
బర బలంబులు సొచ్చి బలువిడిఁ గడచి
వెస నురగ్గాలిఁ గాఁడి వీపున "వెడలు
నిశితాస్త్రములఁ జచ్చి నెఱి నిందు నందు
వినుతి కెక్కుట మాని విన సైఁప రాని
వనవహ్నిఁ గాలంగ వల సె నీరీతి
నాతి నాదుర్మరణమునకు వగవ
బ్రాతి యైనట్టియీపట్టికి వగవ
గురుభక్తి మేరొని ఘోరాటవులకు
నరుదెంచి మనతోడ నలజడిఁ బొంది............. 1170
కడపట నేఁ డిట్లు కాలాగ్ని చేత
సుడివడు మునితనూజునకు నే వగతు
నీమహాపాతకం బేమిటఁ బాయుఁ
గామిని నా కింక గతి యొండు లేదు
కన్నుల నీపాతకము గనుంగొనక
మున్నె యిచ్చెదఁ బ్రాణముల వహ్ని కనుచు,
మనసులో శివు నిల్పి మంటకు నెదురు
చను చున్న యాహరిశ్చంద్రునిఁ జూచి
నిగుడు శోకము మది నిల్పి నవ్వుచును

........................................................................................................... సిననాఁటిగడువునకు, కాఁడి=దూసికొని, నిశీత అస్త్రముల = వాఁడి బాణ ముల చే,బ్రాఁతి = గారాబు, పట్టి =బిడ్డఁడు, మేకొని= సమ్మతించి, సుడివడు= చిక్కుకొన్న - తబ్బిబ్బుపడు, మునితనూజునకున్ = మునికుమారునకు, నిగుడుశోక ము=పయిపయి రేఁగుచున్న దుఃఖము, మదినిల్పి = మనస్సులో నేయడఁచి, నవ్వు