పుట:Haindava-Swarajyamu.pdf/146

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

138

హరిశ్చంద్రోపాఖ్యానము

నలవార్ధిజలము చుం యన నింకఁ గ్రోలి
బలసి లోకము లెల్ల భస్మీకరింప
సడ రెనో బడబాగ్ని యనఁ జుట్టు ముట్టి
పుడమియు దిశలు నభోమండలంబుఁ
గప్పి మండుచు వచ్చు కార్చిచ్చు రాక
తప్పక వీక్షించి ధరణివల్ల భుఁడు............2150
జాలి నెక్కొన నక్క జంబునఁ జింతఁ
దూలుచుఁ దన దేవితోడ నిట్లనియె
'నీవనవహ్ని నిం కేవిధిఁ గడచి
పోవచ్చుఁ జావక పోరాదు మనకు
నంకించి మునితోడ నాడినమాట
బొంకు గాకుండ నాపూనిన నాఁటి
మితికి ఋణం బెల్లం మేలుగాఁ దీర్చి
మృతిఁ బొంద లే నై తి మృగ నేత్రి వినుము
ఏవిఁ బుట్టిన వారికి నెల్ల

పేలఁగా, ఒరలుచుం = టోలుచు, వార్ధ జలము = సముద్రపునీరు, "చు'c యనక్ =చుం అని, ఇంక క్రోలి = ఇంకిపోవునట్లు త్రాఁగి, అడ రెనో = తలప డెనో- సముద్రపు నీళ్లంతయు ఆఁగా పిదపలోకముల నెల్ల చుట్టుక్రమ్మి నీరు సేయుటకు బడబాగ్ని తలపడి దోయన్నట్లు, నభోమండలము= ఆకా శము, రుచిచ్చు పుట్టినవిధ మెట్లనఁగా; - మొదటబిట్టుగా వాయువు వీవగా చెట్లకొమ్మలు ఒరసికొని వేఁడిమి పుట్టి దానివలన చిఱునిప్పులు గలిగి యవి కారాకుగుంపులంబడి రాఁజిచిన్న మంటలు పుట్టి యామంటలు కసవుజొంపము నంబడి కాలి క్రమముగా పొదరిండ్లు రగులుకొని మండి చెట్లకుఁదగిలి పెనుజ్వాల లుగా చుట్టు కమ్ముకొన్న దయ్యే ననుట. నెక్కొనన్ =కలుగఁగా, అక్క జండ = మిక్కుట మైనది, అంకించి =పూని, నాపూనిననాఁటిమితికి = నేను ప్రతిజ్ఞ