పుట:Haindava-Swarajyamu.pdf/144

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఉపసంహారము.

141

యు, కన్పించిన, రుచికరవస్తువు మరియొకరు చవిచూచువరకు నిలుచుట స్వభావము కా దనియు జాతీయోద్యోమ మొనర్చుట తదర్థమై ఇడుమలవడుట రుచికరకార్యజాల మ్మనియు, నిర్బంధముచే కష్టపడుట కష్టము కాదనియు తల పెట్టునో

వానికే ఆశక్తి యలవడును.

చదువరి: ఇది గొప్పజాబితా యైనది. అందరును దీని నే నా డనుకరించుటో?

సంపా: పొరవడకుడు. ఇతరులతో మీకును నాకును సంబంధము లేదు. ప్రతివాడు తనధర్మనిర్వహణ మాలోచింప వలసినది. నాధర్మము నెరవేర్చి ఆరీతిని నాసేవనే చేసికొందునేని ఇతరుల సేవ సులభముగా చేయగలను. మీకు సెల వొసంగుటకుముందు మరల నొక్క పర్యాయము నా చెప్పినది జాపక పరచెద.

(1) నిజమైన స్వరాజ్యము స్వరాజ్యము అనగా స్వనిగ్రహము.

(2) దానికి మార్గము సత్యాగ్రహము అనగా ఆత్మశక్తి, ప్రేమశక్తి.

(3) ఈశక్తిని ప్రచారపెట్టుట కన్నిట స్వదేశి మూలా ధారము.