పుట:Haindava-Swarajyamu.pdf/139

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

136

హైందవ స్వరాజ్యము.

భారతభూమికి పయనమై వచ్చియుండు ఆంగ్లేయులు మీరు సరియైన ఆంగ్లజాతిప్రతినిధులు కారు. సగ మాంగ్లమై పోయిన మేమును సరియైన భారతజాతిప్రతినిధులము గాము. మీరు చేసినదంతయు ఇంగ్లీషుజాతికి తెలియునేని ఆజాతి అనేకవిషయములలో మీతో నేకీభవింపక పోవును. భారత జాతిలో నెక్కువభాగము మీతో నెక్కువసంబంధము పెట్టుకొనలేదు. మీ నాగరకమును కొంచ మావలపెట్టి మీ వేద గ్రంథములనే వెదుకుదు రేని మేము కోరునదంతయు న్యాయ మనుట మీ కందులోనే కానవచ్చును. మేము కోరేకోరిక లన్ని నెరవేరిననే మీ రిట నుండనగును. మీ రట్లుందురేని మీవద్ద మే మెన్ని యో విషయములు నేర్చుకొందుము. మీరును అట్లే మావద్ద నేర్చుకొనగలరు. అట్లు చేసినయెడల మనము పరస్పరము లాభ మందుదుము. లోకకల్యాణమునకును తోడ్పడుదుము. ఇదియంతయు మనసంబంధము అధ్యాత్మికబంధముచే కట్టబడినప్పుడే సాధ్యము.

చదువరి: మీరు జాతి కేమి చెప్పుదురు ?

సంపా: జాతియెవరు?

చదువరి: మన కార్యముల కేజాతి నింతసేపు ఆలోచించు చుంటిమో ఆజాతి, యూరోపియను నాగరకము నెవ్వరి నంటినదో, అట్టి మనము, స్వరాజ్య మెవ్వరము కోరుచున్నామో ఆమనము.