పుట:Haindava-Swarajyamu.pdf/13

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

9


దేశీయ మహాసభ : తదధి కారులు.


యెడ న్యాయముగా నుండు పట్ల మన ఉద్దేశము నెర వేర్చుకొను టలో మనకు వారిసహాయము లభింపగలదు.


చదువరి: ఇప్పుడు - ఇదంతయు నాకు వట్టిపిచ్చిగా దోచు చున్నది. స్వరాజ్యము ఇంగ్లీషు సహాయము ఇవి రెండు పరస్పర విరోధములు. మనకు స్వరాజ్యము రాగా చూచి ఇంగ్లీషువా రెట్లు సహింపగలరు ? అయిన ఆవిషయము మీ రిప్పుడు నాకు నిర్ధా రణ చేసి చెప్ప నక్కర లేదు. దానివిషయమై కాలహరణ మొనర్చుట వ్యర్థము. మనకు స్వరాజ్యము ఎట్లు వచ్చునో మీరు చెప్పునప్పటికి నాకది అర్థము కావచ్చును. ఇంగ్లీషు సహాయము సమాచారము మాట్లాడిన దానివలన మీయెడల నాకు కొంతవ్యతి రేక భావము కలిగినది. కాబట్టి ఈవిషయమే యెక్కువగా చెప్పుచునుండవలదు.


సంపా: నాకు ఆవిషయమున నింకను ప్రసంగింపవలయు నను ఆశ లేదు. మీకు నాయెడ విరుద్ధ భావ మేర్పడినంతట నాకు వ్యసనము లేదు. మొట్ట మొదటనే తీపిగానిమాటలు చెప్పుట మంచిది. శాంతముగా సహనముతో మీవిరుద్ధ భావమును తొలఁ గించుట నావిధి.


చదువరి: మీరు కడపట చెప్పినవిషయమునకు సంతోషము. నాకుదోచినట్లు దాపరికము చేయక మాట్లాడుట కది నాకు అవకాశ మొసఁగుచున్నది. ఒక్క విషయ మింక ను నాకర్థము